ఐయానిక్‍‌తో పాటు మరిన్ని హైబ్రిడ్ కార్ల విడుదలకు సిద్దమైన హ్యుందాయ్

Written By:

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ 2018 నుండి హైబ్రిడ్ కార్లను విరివిగా విడుదల చేయనుంది. అత్యుత్తమ హైబ్రిడ్ వెహికల్ మార్కెట్‌ను సృష్టించేందుకు హ్యుందాయ్ అన్ని విదాలా సిద్దం అవుతోంది. అందుకోసం వచ్చే 2018 ఏడాది వేదికగా తమ ఇయానిక్ హైబ్రిడ్ సెడాన్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది.

పొగ కాలుష్యాన్ని ఎదుర్కునే ఉత్పత్తుల తయారీ మీద దృష్టిపెట్టిన హ్యుందాయ్. హైబ్రిడ్ వాహనాల వినియోగం ద్వారా ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలను కస్టమర్లకు వివరించనుంది. నిజానికి పెట్రోల్, డీజల్ మరియు సిఎన్‌జి తో నడిచే వాహనాలను కాకుండా హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి పన్ను రాయితీ మరియు ఇన్సెంటివ్‌లు అందివ్వనుంది.

హ్యుందాయ్ మోటార్స్ ఈ ఇయానిక్ హైబ్రిడ్ మోడల్‌ను అంతర్జాతీయ విపణి నుండి దిగుమతి చేసుకుని దేశీయంగా అందుబాటులో ఉంచనుంది. టయోటా ప్రియస్ సెడాన్‌తో గట్టి పోటీని ఎదుర్కునే దీని ధర సుమారుగా రూ. 39 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండే అవకాశం ఉంది.

హ్యుందాయ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పిటిఐతో మాట్లాడుతూ, సంస్థ భవిష్యత్తులో మరిన్ని మిల్డ్ హైబ్రిడ్ సిస్టమ్స్‌ను అభివృద్ది చేసి సంస్థ యొక్క బాగా ప్రాచుర్యం పొందిన సెడాన్ మరియు ఎస్‌యూవీలలో అందివ్వనున్నట్లు తెలిపాడు.

ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాలలో డీజల్ మరియు పెట్రోల్ కార్ల కన్నా వీటి మీద ఎక్సైజ్ సుంకం చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద ఎస్‌యూవీలు మరియు ఇతర డీజల్, పెట్రోల్ కార్ల మీద ఎక్సైజ్ సుంకం 24 నుండి 30 శాతం ఉంటే హైబ్రిడ్ కార్ల మీద 12.5 శాతం మాత్రమే ఉంది.

2017 నుండి 2020 మధ్య మొత్తం 8 హైబ్రిడ్ కార్లను పరిచయం చేయడానికి హ్యుందాయ్ మోటార్స్ సన్నద్దం అవుతోంది. వీటిలో మూడు కొత్త మోడళ్లను అభివృద్ది చేయగా, మిగతా ఐదు మోడళ్లను ఇప్పటికే హ్యుందాయ్ లైనప్‌లో ఉన్న వాటికి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా హైబ్రిడ్ సాంకేతికతో పరిచయం చేయనుంది.

హ్యుందాయ్ మోటార్స్ యొక్క నూతన అప్ కమింగ్ మోడళ్ల గురించి చూస్తే, 2017 మోడల్‌కు చెందిన హ్యుందాయ్ వెర్నా ప్రీమియమ్ సెడాన్ విడుదలకు సన్నద్దం అవుతోంది. దీనికి చెందిన మరిన్ని ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

English summary
Hyundai's Hybrid Revolution Set To Hit India — Electrifying Times Ahead
Story first published: Tuesday, March 7, 2017, 10:42 [IST]
Please Wait while comments are loading...

Latest Photos