2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర రూ. 5.38 లక్షలు

హ్యుందాయ్ మోటార్స్ విపణిలోకి 2017 ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసింది. స్వల్ప డిజైన్ మరియు ఇంజన్ మార్పులతో హ్యుందాయ్ తమ ఎక్సెంట్‌ను విడుదల చేసింది.

By Anil

హ్యుందాయ్ మోటార్స్ 2017 ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ కారును రూ. 5.38 లక్షల ప్రారంభ ధరతో విపణిలోకి విడుదల చేసింది. డిజైన్ మరియు ఇంజన్‌లో జరిగిన మార్పులు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు పూర్తి వివరాల కోసం...

2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

సరికొత్త 2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, టాటా టిగోర్ మరియు ఫోర్డ్ తాజాగ విడుదల చేసిన ఆస్పైర్‌లకు గట్టి పోటీనివ్వనుంది.

 ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్ల ధరలు

ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్ల ధరలు

  • ఎక్సెంట్ ఇ ధర రూ. 5.38 లక్షలు
  • ఎక్సెంట్ ఇ ప్లస్ ధర రూ. 5.93 లక్షలు
  • ఎక్సెంట్ ఎస్ ధర రూ. 6.29 లక్షలు
  • ఎక్సెంట్ ఎస్ఎక్స్ ధర రూ. 6.73 లక్షలు
  • ఎక్సెంట్ ఎస్ఎక్స్(ఒ) ధర రూ. 7.51 లక్షలు
  • ఎక్సెంట్ ఎస్ ఆటోమేటిక్ ధర రూ. 7.09 లక్షలు
  • ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ డీజల్ ధరలు

    ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ డీజల్ ధరలు

    • ఎక్సెంట్ ఇ ధర రూ. 6.28 లక్షలు
    • ఎక్సెంట్ ఇ ప్లస్ ధర రూ. 6.83 లక్షలు
    • ఎక్సెంట్ ఎస్ ధర రూ. 7.19 లక్షలు
    • ఎక్సెంట్ ఎస్ఎక్స్ ధర రూ. 7.63 లక్షలు
    • ఎక్సెంట్ ఎస్(ఒ) ధర రూ. 8.41 లక్షలు
    • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.
      ఇంజన్ వివరాలు

      ఇంజన్ వివరాలు

      నూతనంగా 2017 మోడల్‌తో విడుదలైన హ్యుందాయ్ ఎక్సెంట్ ఇండియన్ మార్కెట్లో 1.2-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.

      2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

      2017 ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్‌లోని 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 82బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్. ఇందులోని మ్యాన్యువల్ వేరియంట్ 20.14కిమీల మైలేజ్ మరియు ఆటోమేటిక్ వేరియంట్ 17.36కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

      2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

      2017 హ్యుందాయ్ ఎక్సెంట్ లోని 1.2-లీటర్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల ఇది లీటర్‌కు 25.4కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

      ట్రాన్స్‌మిషన్ వివరాలు

      ట్రాన్స్‌మిషన్ వివరాలు

      పెట్రోల్ వేరియంట్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్, అదే విధంగా డీజల్ ఇంజన్ వేరియంట్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

      హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్

      హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్

      మునుపటి ఎక్సెంట్ మోడల్‌తో పోల్చితే మార్పులను గుర్తుపట్టేందుకు ఎక్ట్సీరియర్ డిజైన్ మార్పులకు ప్రాధాన్యతనిచ్చారు. ఫ్రంట్ డిజైన్‌లో సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ గ్రిల్‌లో అడ్డంగా ఉన్న క్రోమ్ పూత పూయబడిన స్లాట్ల ద్వారా ప్రీమియమ్ లుక్‌ను కలిగి ఉంది.

      2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

      ఫ్రంట్ బంపర్‌లో అధునాతన పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు ఫాగ్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి. బంపర్ మీద రిఫ్లెక్టర్లు, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లో ఫ్రంట్ బంపర్ మరియు అధునాతన డిజైన్‌లో రియర్ టెయిల్ ల్యాంప్స్‌ ఉన్నాయి.

      2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

      అదనంగా ఇందులో స్టైలింగ్ షార్క్ ఫిన్ యాంటెన్నా, లాగడానికి వీలున్న క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఏరోడైనమికల్‌గా డిజైన్ చేయబడిన అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు, వాటి మీద టర్న్ ఇండికేటర్ల జోడింపుతో ఎక్సెంట్ కారుకు ప్రీమియమ్ మరియు స్పోర్టివ్ ఫీల్‌ను తీసుకొచ్చింది.

      2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

      హ్యుందాయ్ ఎక్సెంట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ప్రకాశవంతమైన, విశాలమైన ఇంటీరియర్ కలదు. నూతన అప్‌హోల్‌స్ట్రే, లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్, వెనుక సీటుకు ఆర్మ్ రెస్ట్, కప్ హోల్డర్, స్మార్ట్ కీ ద్వారా పుష్ బటన్ స్టార్ట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, మరియు డ్రైవర్ సీటు ఎత్తును అడ్జెస్టు చేసుకునే సదుపాయం ఇందులో కలదు.

      2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

      హ్యుందాయ్ ఎక్సెంట్ ఇంటీరియర్‌లో పూర్తి స్థాయి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, రియర్ ఏ/సి వెంట్లు మరియు డీఫాగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

      ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

      ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

      సరికొత్త హ్యుందాయ్ ఎక్సెంట్ ఇంటీరియర్‌లో 7.0-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఆడియో వీడియో సిస్టమ్ కలదు. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి ద్వారా ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మిర్రర్ లింక్, స్మార్ట్ న్యావిగేషన్ వంటి వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు.

      2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

      అదనంగా ఉత్తమ డ్రైవింగ్ కోసం వాయిస్ గుర్తుపట్టే మరియు న్యావిగేషన్ సపోర్ట్ వ్యవస్థ, స్టీరింగ్ మీద ఉన్న కంట్రోల్స్, ఉత్తమ మైలేజ్ కోసం గేర్ షిఫ్ట్ ఇండికేటర్ మరియు రియర్ పవర్ అవుట్ లెట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందివ్వడం జరిగింది.

      2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

      హ్యుందాయ్ తమ ఎక్సెంట్‌లోని అన్ని వేరియంట్లలో స్టాండర్డుగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులను అందించింది. మరియు ఆప్షనల్‌గా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది.

      2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

      కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోతక్కువ నిర్వహణ ఖర్చు మరియు రెండేళ్ల పాటు నిరంతర కిలోమీటర్లు వారంటీ అందిస్తోంది హ్యుందాయ్.

Most Read Articles

English summary
Read In Telugu To Know About 2017 Hyundai Xcent Launch. Get more details about 2017 Hyundai Xcent Price, Engine, Features, Specifications and more.
Story first published: Friday, April 21, 2017, 10:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X