డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్‌లో దొరికితే 7 ఏళ్ల జైలు శిక్ష

Written By:

డ్రంక్ డ్రైవ్ ఎంతో రిస్క్‌తో కూడుకున్నదని తెలిసినా కూడా చేస్తూనే ఉంటారు. ఇలాంటి వారి వలన ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా జరిగే ప్రమాదాలను నివారించడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, జరిమానాలు విధించినా... మందు బాబుల్లో ఎలాంటి మార్పులు రాలేదు..

To Follow DriveSpark On Facebook, Click The Like Button
డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్‌లో దొరికితే 7 ఏళ్ల జైలు శిక్ష

బాధ్యతారహితంగా మద్యం సేవించి వాహనాన్ని నడిపే వారి కోసం ఉన్న శిక్షలను పెంచింది. మద్యం సేవించి వాహనాన్ని నడిపినపుడు ప్రమాదం జరిగి మరణానికి కారణమైన వారికి 7 ఏళ్ల పాటు జైలు శిక్షను ఖరారు చేసింది.

Recommended Video - Watch Now!
Honda CR-V Crashes Into A Wall
డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్‌లో దొరికితే 7 ఏళ్ల జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇతరుల మరణానికి కారణమయ్యే వారికి గతంలో రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉండేది. దీనికి మరో ఐదేళ్లు పొడగించి, మొత్తం 7 సంవత్సరాల నాన్ బెయిల్ జైలు శిక్షను ఖరారు చేసింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్‌లో దొరికితే 7 ఏళ్ల జైలు శిక్ష

మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇతరుల చావుకు కారణమవ్వడాన్ని క్షమించరాని నేరంగా పరిగణించి సెక్షన్ 304ఏ క్రింద రెండేళ్ల పాటు జైలు శిక్ష లేదా జరిమానా మరియు రెండు శిక్షలు కూడా విధించే నియమం గతంలో ఉండేది.

డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్‌లో దొరికితే 7 ఏళ్ల జైలు శిక్ష

ఈ మార్పులకు సంభందించిన సిఫార్సులను జాతీయ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అంజేశారు. "డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఇతరుల చావుకు కారణయ్యే వారిని "నిర్లక్ష్యపు డ్రైవింగ్" క్రింద కాకుండా "శిక్షించదగిన హత్యానేరం" క్రింద శిక్షించాలని హోం మినిస్టర్‌ను గడ్కరీ కోరారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్‌లో దొరికితే 7 ఏళ్ల జైలు శిక్ష

కేంద్ర ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ మీద శిక్షలను మరింత కఠినం చేయడానికి గల ప్రధానం కారణం, ఈ మధ్య కాలంలో నమోదైన రోడ్డు ప్రమాదాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే అధికం. రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవిస్తున్న మరణాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చనిపోతున్నవారే ఎక్కువ.

Trending On DriveSpark Telugu:

మగాళ్ల మతి పోగొట్టిన ముగ్గురు హైదరాబాదీ మహిళలు

డిజిలాకర్‌లో DL, RC చూపిస్తే, మోడీకి చూపించమన్న పోలీస్

ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ బైకు దొంగతనానికి 30 సెకన్లు చాలు: విస్తుపోయే నిజాలు వెల్లడించిన దొంగ

డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్‌లో దొరికితే 7 ఏళ్ల జైలు శిక్ష

మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడపడాన్ని మొదలుపెడితే, సాధారణ సందర్భాల కంటే అధిక వేగంతో డ్రైవ్ చేస్తాడు. అధిక వేగాన్ని అదుపు చేయలేకపోవడం మరియు వెంటనే స్పందించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్‌లో దొరికితే 7 ఏళ్ల జైలు శిక్ష

దీంతో పాటు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్ టైమ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఉన్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, నూతన విధానం ప్రకారం, లైఫ్ టైమ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ జీవితం కాలం 15 సంవత్సరాలు.

డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్‌లో దొరికితే 7 ఏళ్ల జైలు శిక్ష

అంటే కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలో ఒక్కసారి లైఫ్ టైమ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే 15 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. అయితే, లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంతో కొత్త వెహికల్ ఆన్ రోడ్ ధర చాలా అధికంగా ఉంటుంది

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Indian government increases imprisonment for ‘drunken driving causing death’ to 7 years!
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark