కంపాస్ ఎస్‌యూవీపై బుకింగ్స్ ప్రారంభించిన జీప్

Written By:

జీప్ కంపెనీ అందిస్తున్న ఎస్‌యూవీలలో ఎంట్రీ లెవల్ మోడల్ '"కంపాస్". మేకిన్ ఇండియా చొరవతో దీనిని ఇండియాలోనే ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. వచ్చే ఆగష్టు నాటికి పూర్తి స్థాయిలో విడుదల కానున్న దీని మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
జీప్ కంపాస్ బుకింగ్స్ ప్రారంభం

జీప్ కాంపాక్ట్ ఎస్‌యూవీని రూ. 50,000 లు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. విడుదల అనంతరం బుక్ చేసుకున్న వారికి డెలివరీ చేయడం జరుగుతుంది. జీప్ వారి ఎంట్రీ లెవల్ కంపాస్ ఎస్‌యూవీలో డ్రైవర్‌తో సహా ఐదు మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యం ఉంది.

జీప్ కంపాస్ బుకింగ్స్ ప్రారంభం

జీప్ కంపాస్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభించును. ఇందులో 160బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల శక్తివంతమైన 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

జీప్ కంపాస్ బుకింగ్స్ ప్రారంభం

డీజల్ వేరియంట్ ఎంచుకోవాలనుకునే వారికోసం జీప్ తమ కంపాస్ ఎస్‌యూవీలో 170బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ఉత్పత్తి చేయగల 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు.

జీప్ కంపాస్ బుకింగ్స్ ప్రారంభం

విడుదల సమయానికి రెండు ఇంధన వేరియంట్లలోని కంపాస్‍‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను స్టాండర్డ్‌గా అందివ్వనున్నారు. పెట్రోల్ వేరియంట్లో డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ను ఆప్షనల్‌గా అందివ్వనున్నారు.

జీప్ కంపాస్ బుకింగ్స్ ప్రారంభం

టు వీల్ డ్రైవ్ మరియు ఆల్ డ్రైవ్ ఆప్షన్‌లో రానుంది. ఇంజన్, ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్ సిస్టమ్‌లకు అనుగుణంగా బెస్ట్ బడ్జెట్‌లోపే దీని ధరను నిర్ణయిస్తే, ఇలాంటి వాటికి ఇండియాలో ఉన్న డిమాండ్‍‌ను జీప్ అందుకోవచ్చు.

జీప్ కంపాస్ బుకింగ్స్ ప్రారంభం

జీప్ కంపాస్ ఎస్‌యూవీ ధరలు 18 నుండి 25 లక్షల మధ్య ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్లో ఈ ధరల శ్రేణితో గట్టిగా పోటీనిచ్చే ఉత్పత్తుల లేకపోవడం, ఉన్నా కూడా అవి జీప్ బ్రాండ్‌‌తో పోటీపడటం కాస్త కష్టమే.

జీప్ కంపాస్ బుకింగ్స్ ప్రారంభం

జీప్ కంపాస్ ఎస్‌యూవీకి టెస్ట్ డ్రైవ్ నిర్వహించి దీని అనుకూలతలు మరియు ప్రతికూలతలను టెస్ట్ డ్రైవ్ రివ్యూ ద్వారా త్వరలో ప్రచురిస్తాం. తాజా ఆటోమొబైల్ కథనాల కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు!

Read more on: #జీప్ #jeep
English summary
Read In Telugu Jeep Compass Bookings Now Open
Story first published: Wednesday, June 14, 2017, 9:43 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark