జీప్ కంపాస్: మూడు రోజుల్లో 1,000 బుకింగ్స్

Written By:

జీప్ ఇండియా తమ కంపాస్ ఎస్‌యూవీ మీద రూ. 50,000 ల ప్రారంభ ధరతో బుకింగ్స్ ప్రారంభించింది. అయితే జీప్ సైతం ఆశ్చర్యపోయేలా కేవలం మూడు రోజుల్లోనే 1,000 బుకింగ్స్ నమోదయ్యాయి.

త్వరలో విడుదల కానున్న జీప్ కంపాస్ ఎస్‌యూవీని ఆన్‌లైన్లో మరియు జీప్ ఇండియా డీలర్ల వద్ద బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. కేవలం మూడే రోజుల్లో ఈ విధమైన బుకింగ్స్ రావడంతో జీప్ హర్షం వ్యక్తం చేసింది.

జీప్ కంపాస్ బుకింగ్స్

ఈ బుకింగ్స్ చూసిన తరువాత కంపాస్ ఎస్‌యూవీకి ఇండియాలో ముందు ముందు ఎలాంటి డిమాండ్ ఉండబోతుందో జీప్ అంచనా వేసుకుంటోంది. అయితే కంపాస్ మంచి సక్సెస్ అందుకోవడం ఖచ్చితం అని చెప్పవచ్చు.

జీప్ కంపాస్ బుకింగ్స్

కొన్ని నెలల క్రితం జీప్ ఇండియా తమ కంపాస్ ఎస్‌యూవీని దేశీయంగా ఆవిష్కరించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లోని రంజన్‌గావ్‌లో ఉన్న ప్రొడక్షన్ ప్లాంటులో దీనిని ఉత్పత్తి చేస్తోంది. అంతే కాకుండా కుడి వైపు స్టీరింగ్ వీల్ ఉన్న వాహనాలను వినియోగించే దేశాలైన ఇంగ్లాండ్, జపాన్ మరియు సౌత్ ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది.

జీప్ కంపాస్ బుకింగ్స్

80 శాతం దేశీయంగా తయారైన విడి భాగాలను ఉపయోగించి కంపాస్‌ను ఉత్పత్తి చేస్తోంది జీప్. తద్వారా ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీని రేకెత్తించే విధంగా కంపాస్ ధరను నిర్ణయించనుంది. రిపోర్ట్స్ ప్రకారం, కంపాస్ పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 15 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.

జీప్ కంపాస్ బుకింగ్స్

కంపాస్ పెట్రోల్ వేరియంట్లో 160బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్, అదే విధంగా 170బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 2.0-లీటర్ ఇంజన్ వేరియంట్లో రానుంది. వీటిని 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లభించును.

జీప్ కంపాస్ బుకింగ్స్

కంపాస్ ఎస్‌యూవీ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటు జీప్ టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్‌తో రానుంది. వివిధ డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా పవర్ మరియు టార్క్ చక్రాలకు అందించేందుకు స్నో, శాండ్ మరియు రాక్ అనే విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

Read more on: #జీప్ #jeep
English summary
Read In Telugu Jeep Compass Bookings In 3 Days Is Quite Impressive

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark