జీప్ కంపాస్ తొలి యాక్సిడెంట్: ఉత్తమ నిర్మాణ విలువలు మరియు భద్రత ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్ కంపాస్

Written By:

సరిగ్గా నెల క్రితం ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన జీప్ కంపాస్, ఏదో విధంగా ప్రతిసారి వార్తల్లోకెక్కుతోంది. వార్తల్లోకెక్కిన ప్రతిసారి దీని గురించి సంచలనాలు మరియు రికార్డులు వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలిచేవి.

అయితే ఈ సారి ఎలాంటి రికార్డులు బ్రేక్ అవ్వలేదు. జీప్ కంపాస్ విపణలోకి విడుదలయ్యాక తొలిసారి ప్రమాదానికి గురైంది. ఈ కథనంలో జీప్ కంపాస్ నిర్మాణపరమైన నాణ్యత మరియు ఇందులోని భద్రత ఫీచర్ల గురించి చూద్దాం రండి...

జీప్ కంపాస్ తొలి యాక్సిడెంట్

ఎరుపు రంగులో ఉన్న జీప్ కంపాస్ లిమిటెడ్(ఒ) వేరియంట్ ప్రమాదానికి గురైనట్లు వీడియో మరియు ఫోటోలు ద్వారా తెలిసింది. జీప్ కంపాస్ యాక్సిడెంట్ ఫోటోలు దాదాపు అన్ని ఆటోమొబైల్ మీడియా మరియు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రదానికి గల కారణాలు తెలియరాలేదు. కాని అతి వేగమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
జీప్ కంపాస్ తొలి యాక్సిడెంట్

అద్దం మీద అంటించి ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్‌ ఆధారంగా ఇది బ్రాండ్ న్యూ జీప్ కంపాస్ అని తెలుస్తోంది. అయితే మొదటిసారి వాహనం కొన్న వ్యక్తి ఇలా చేశాడా లేదా షోరూమ్ వ్యక్తులు దీనిని తరలిస్తుండగా ఇలా జరిగిందా అనే విషయం తెలియరాలేదు. అతి వేగం మీద ఉన్నప్పుడు షడన్‌గా స్టీరింగ్ ఆపరేట్ చేసి, కంట్రోల్ చేయలేక యాక్సిడెంట్ చేసినట్లు స్పష్టం అవుతోంది.

వీడియో ఫుటేజీ ఆధరంగా చూస్తే, ప్రమాదానికి గురైన స్థలిలో కంపాస్‌ ఎస్‌యూవీకి ప్రక్కవైపున మలుపు ఉంది. ఎస్‌యూవీ చక్రాలు ఎడమ వైపుకు తిరిగి ఉన్నాయి. అతి వేగం మీద ఉన్నపుడు స్టీరింగ్ ఉన్నట్లు ఆపరేట్ చేయడం ద్వారా ఎస్‌యూవీ ముందు కుడి భాగం మీద ప్రమాదం తీవ్రత అధికంగా పడింది.

జీప్ కంపాస్ తొలి యాక్సిడెంట్

భద్రత పరంగా జీప్ కంపాస్ ఎస్‌యూవీలో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగాం వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా ఉన్నాయి.

జీప్ కంపాస్ తొలి యాక్సిడెంట్

జీప్ అందించిన ఈ బేసిక్ సేఫ్టీ ఫీచర్ల ద్వారా వాహనాన్ని ప్రమాదం నుండి దాదాపు తప్పించవచ్చు. డ్రైవర్ ఎలాంటి ఒత్తిడి లేకుండా వాహనం మొత్తాన్ని క్షణాల్లో తన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు.

జీప్ కంపాస్ తొలి యాక్సిడెంట్

మొత్తానికి ఈ ప్రమాదం ఎలా మొదలయ్యింది, చివరికి ఎలా ఎండ్ అయ్యింది? కంపాస్ నడుపుతున్న డ్రైవర్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నపుడు అపరిమితంగా స్టీరింగ్ వాడటం మరియు అదే సమయంలో అధిక వేగం మీద ఉండటంతో, రోడ్డు ప్రక్కన ఉన్న డివైడర్ దాటుకుని ఆపోజిట్ రోడ్డు దాటుకుని ఫుట్ పాత్ ప్రక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో కంపాస్ మీద ప్రమాదం తీవ్రత ఇలా ఉంది.

జీప్ కంపాస్ తొలి యాక్సిడెంట్

అంతే కాకుండా ఈ ప్రమాదానికి మరో కారణం కూడా ఉండవచ్చు. డ్రైవర్ మత్తులో ఉండటం ద్వారా కంట్రోల్ కోల్పోయి ఇలా జరిగి ఉండవచ్చు. అయితే ఇవన్నీ ఊహాజనితాలే మాత్రమే. ప్రమాదం ఎలా జరిగినప్పటికీ కంపాస్ ఎంత సురక్షితమైనదో నిరూపించబడింది. రెండు ఎయిర్ బ్యాగులు విచ్చుకున్నాయి. మరియు బాడీ కూడా ధృడంగా ఉంది.

జీప్ కంపాస్ తొలి యాక్సిడెంట్

జీప్ కంపాస్ ఎస్‌యూవీ రూ. 14.95 లక్షల నుండి 20.65 లక్షల ధరల శ్రేణిలో విడుదలయ్యింది. నెల రోజుల వ్యవధిలోపే దేశవ్యాప్తంగా 8,100 యూనిట్ల బుకింగ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఓ సునామీ తీసుకొచ్చిందని చెప్పవచ్చు.

జీప్ కంపాస్ తొలి యాక్సిడెంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బెంగళూరులో ప్రమాదానికి గురైన జీప్ కంపాస్ లోని అత్యుత్తమ నాణ్యత మరియు భద్రతను నిరూపించుకుంది. ఈ ధరల శ్రేణిలో సురక్షితమైన ఎస్‌యూవీ వాహనంగా జీప్ కంపాస్‌ను చెప్పుకోవచ్చు.

English summary
Read In Telugu: Jeep Compass First Crash In India
Story first published: Tuesday, August 29, 2017, 9:42 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark