కంపాస్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రొడక్షన్ ప్రారంభించిన జీప్

జీప్ ఇండియా కంపాస్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రొడక్షన్ ప్రారంభించింది. అక్టోబర్ 2017 నుండి జీప్ ప్రొడక్షన్ ప్లాంటులో పెట్రోల్ వేరియంట్ల ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది.

By Anil

జీప్ ఇండియా కంపాస్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రొడక్షన్ ప్రారంభించింది. అక్టోబర్ 2017 నుండి జీప్ ప్రొడక్షన్ ప్లాంటులో పెట్రోల్ వేరియంట్ల ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది.

కంపాస్ పెట్రోల్ ఆటోమేటిక్ రెండు విభిన్న వేరియంట్లలో లభించనుంది. అవి, లిమిటెడ్ మరియు లిమిటెడ్ ఆప్షన్ వేరియంట్లు. వీటి ధరలు రూ. 18.96 లక్షలు మరియు 19.67 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉండనున్నాయి.

జీప్ కంపాస్ పెట్రోల్

జీప్ ఇండియా కంపాస్ ఎస్‌యూవీని జూలై 2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. అప్పటి నుండి డిమాండ్ ఉన్న వేరియంట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తూ వస్తోంది. విడుదల అనంతరం డీజల్ మరియు మ్యాన్యువల్ వేరియంట్లలో మాత్రమే లభించే కంపాస్ ఎస్‌యూవీ డెలివరీలను ఆగష్టు 6, 2017 నుండి ప్రారంభించింది.

జీప్ కంపాస్ పెట్రోల్

అయితే, కంపాస్ పెట్రోల్ వేరియంట్లను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే దీపావళి నాటికి విడుదల చేస్తామని జీప్ మాటిచ్చింది. అంతే కాకుండా కంపాస్‌లో సన్ రూఫ్ కూడా రానుంది. గతంలో జీప్ లిమిటెడ్ 4X2 వేరియంట్‌ను ఇతర ఫీచర్లతో పలుమార్లు పరీక్షించింది.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
జీప్ కంపాస్ పెట్రోల్

పెట్రోల్ కంపాస్‌లో 1.4-లీటర్ సామర్థ్యం గల గాలితో చల్లబడే నాలుగు సిలిండర్ల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 160బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపాస్‌లోని లిమిటెడ్ మరియు లిమిటెడ్ ఆప్షన్ వేరియంట్లలో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో మరియు స్పోర్ట్ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానుంది.

జీప్ కంపాస్ పెట్రోల్

కంపాస్ ఎస్‌యూవీలోని డీజల్ వేరియంట్లో కూడా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పరిచయం చేయాలని జీప్ భావిస్తోంది. అయితే, జనవరి 2018 నాటికి దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఇండియాలో జీప్ సంస్థకు కంపాస్ మంచి సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచింది. పెద్ద ఎస్‌యూవీల మీద జిఎస్‌టి పెరిగిన నేపథ్యంలో కంపాస్ ధరలు పెరిగినప్పటికీ డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

జీప్ కంపాస్ పెట్రోల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జీప్ కంపాస్, ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లో ఓ సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ధరకు తగ్గ విలువలతో వచ్చిన జీప్, బ్రాండ్ పేరుకు ఏ మాత్రం తీసిపోకుండా... ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఒక కొత్త బ్రాండ్ పేరును సృష్టించింది.

ప్రస్తుతం అందుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కంపాస్‌ను మరిన్ని విభిన్న వేరియంట్లలో విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

More from DriveSpark

Article Published On: Monday, September 25, 2017, 17:59 [IST]
English summary
Read In Telugu: Jeep Compass Petrol Automatic Production Begins In India
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+