కంపాస్ పెట్రోల్ వేరియంట్ల డెలివరీ షురూ చేసిన జీప్
జీప్ ఇండియా మార్కెట్లోకి తొలుత డీజల్ వెర్షన్ కంపాస్‌ను లాంచ్ చేసింది. అయితే, పెట్రోల్ వేరియంట్ల మీద వస్తున్న డిమాండ్ దృష్ట్యా ఇప్పుడు పెట్రోల్ వెర్షన్ కంపాస్ ఎస్‌యూవీని డెలివరీలకు సిద్దం చేస్తోంది.
జీప్ ఇండియా మార్కెట్లోకి తొలుత డీజల్ వెర్షన్ కంపాస్‌ను లాంచ్ చేసింది. అయితే, పెట్రోల్ వేరియంట్ల మీద వస్తున్న డిమాండ్ దృష్ట్యా ఇప్పుడు పెట్రోల్ వెర్షన్ కంపాస్ ఎస్‌యూవీని డెలివరీలకు సిద్దం చేస్తోంది.

జీప్ సుమారుగా నెల రోజుల క్రితమే కంపాస్ పెట్రోల్ వేరియంట్ల ప్రొడక్షన్‌ను ప్రారంభించింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, కంపాస్ పెట్రోల్ వేరియంట్లు డీలర్లను చేరుతున్నట్లు తెలిసింది.

జీప్ ఇండియాలో ఉన్న రంజన్‌గావ్ ప్రొడక్షన్ ప్లాంటులో తొలుత డీజల్ కంపాస్ ఎస్‌యూవీల ప్రొడక్షన్ ప్రారంభించింది. తరువాత, జూలై 2017లో దేశవ్యాప్తంగా తమ కంపాస్‌ను లాంచ్ చేసింది.
Recommended Video


ఇప్పటికే ప్రొడక్షన్ ప్రారంభమైన పెట్రోల్ వేరియంట్ల ఆధారంగా కంపాస్ ఇక మీదట మూడు విభిన్న పెట్రోల్ మరియు ఏడు విభిన్న డీజల్ వేరియంట్లలో లభించనుంది. పెట్రోల్ కంపాస్ లను బుక్ చేసుకున్న కస్టమర్లకు అతి త్వరలోనే డెలివరీ ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో లభించనున్న కంపాస్ పెట్రోల్ వెర్షన్ మీద రూ. 50,000 ల బుకింగ్ మొత్తంతో డీలర్లు బుకింగ్స్ ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీటి మీద వెయిటింగ్ పీరియడ్ మూడు నెలల వరకు ఉంది.

కంపాస్ పెట్రోల్ వెర్షన్‌లో సాంకేతికంగా 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 160బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

కంపాస్ పెట్రోల్ వెర్షన్ లోని స్పోర్ట్ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుండగా, లిమిటెడ్ మరియు లిమిటెడ్ ఆప్షన్ వేరియంట్లు 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యం కానున్నాయి.

జీప్ తమ కంపాస్ డీజల్ వేరియంట్లోని టాప్ ఎండ్ మోడల్‌లో అందించిన ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ పెట్రోల్ వేరియంట్లో రావడం లేదు. జీప్ భవిష్యత్తులో కంపాస్ డీజల్ వేరియంట్లో కూడా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అతి త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
జీప్ కంపాస్ విడుదలతో పెను సంచనళనమే సృష్టించిందని చెప్పవచ్చు. ప్రపంచ శ్రేణి ఫీచర్లు మరియు నాణ్యతతో అమెరికా దిగ్గజం జీప్ ప్రవేశపెట్టిన కంపాస్ ఎన్నో దేశీయ మరియు విదేశీ మోడళ్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది.
డిమాండుకు తగ్గ ఉత్పత్తిని అందుకులేక భారీ వెయిటింగ్ పీరియడ్ ప్రకటించిన జీప్ ఇప్పుడు కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జోడించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. విసృత శ్రేణి ఆకట్టుకునేందుకు కంపాస్ అద్బుతమైన ప్రణాళికల వల్లించింది.


Click it and Unblock the Notifications








