కంపాస్‌తో పాటు అన్ని మోడళ్ల మీద ధరలు పెంచిన జీప్

Written By:

జిఎస్‌టి ట్యాక్స్ సవరణ అనంతరం ట్యాక్స్ పెంపు పరిధిలోకి వచ్చే అన్ని వాహనాల మీద ఆయా కంపెనీలు ధరల పెంపు బాట పట్టాయి. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా విభాగం జీప్ దేశీయంగా విక్రయిస్తున్న దాదాపు అన్ని మోడళ్ల మీద ధరలు పెంపు చేపట్టింది.

జీప్ కంపాస్ ధరలు

జీప్ ఇండియా లైనప్‌లో కంపాస్ ఎస్‌యూవీ ఎంట్రీ లెవల్ వెహికల్. జీప్ ఉత్పత్తి చేసే అత్యంత ఖరీదైన వ్రాంగ్లర్ మరియు గ్రాండ్ చిరోకీ ఎస్‌యూవీలతో పాటు ప్రారంభ మోడల్ కంపాస్ మీద కూడా ధరలు పెంచింది. ఏయే మోడళ్ల మీద ఎంత మేరకు ధరలు పెరిగాయో చూద్దాం రండి...

జీప్ కంపాస్ ధరలు

జీప్ కంపాస్‌లోని వివిధ వేరియంట్ల ఆధారంగా రూ. 21,000 ల నుండి 72,000 ల వరకు ధరలు పెరిగాయి. ఇక వ్రాంగ్లర్ మరియు గ్రాండ్ చిరోకీ మోడళ్ల మీద రూ. 2.75 లక్షల నుండి రూ. 6.4 లక్షలు వరకు ధరలు పెరిగాయి.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
జీప్ కంపాస్ ధరలు

ప్రస్తుతం మిడ్ సైజ్ కంపాస్‌కి ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జూన్ 19 నుండి సెప్టెబర్ 1, 2017 మధ్య కాలంలోనే ఏకంగా పది వేల యూనిట్లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. ఏదేమైనప్పటికీ, ధరలు పెంపు ప్రభావం కంపాస్ విక్రయాలు మీద ఖచ్చితంగా పడనుంది.

జీప్ కంపాస్ ధరలు

హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్, టాటా హెక్సా మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 లను కోరుకునే కస్టమర్లు ఇప్పుడు కంపాస్‌ను ఎంచుకుంటున్నారు. ఎస్‌యూవీ ముసుగులో ఎన్నో కంపెనీలు భారీ ధరలతో తమ వెహికల్స్ విక్రయిస్తున్న తరుణంలో అమెరికన్ ఎస్‌యూవీ బ్రాండ్ జీప్ కంపాస్‌ను అత్యంత సరసమైన ధరతో విడుదల చేయడం ఇందుకు ప్రధాన కారణం.

జీప్ కంపాస్ ధరలు

జిఎస్‌టి సవరణతో హోండా, టయోటా కిర్లోస్కర్ ఇండియా మరియు ఇసుజు మోటార్స్ ఇప్పటికే తమ వాహనాల మీద ధరలు పెంచాయి.

Read more on: #జీప్ #jeep
English summary
Read In Telugu: Jeep compass price hike in india
Story first published: Saturday, September 16, 2017, 10:43 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark