భారీగా పెరగనున్న జీప్ కంపాస్ ధర

గ్గజ సంస్థలకు పెద్ద షాక్ ఇస్తూ జీప్ విడుదల చేసిన కంపాస్ ఎస్‌యూవీ సంచలనాత్మక విజయాన్ని అందుకుంది. అయితే, తమ మోస్ట్ పాపులర్ అండ్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ కంపాస్ ధర పెంచుతున్నట్లు జీప్ ఓ ప్రకటించింది.

By Anil

అమెరికాకు చెందిన దిగ్గజ లగ్జరీ ఎస్‌యూవీల తయారీ సంస్థ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(జీప్) దేశీయంగా 2016లో అధికారిక కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే, జీప్ ఉనికిని ఇండియా మొత్తానికి చాటి చెప్పిన మోడల్ కంపాస్.

జీప్ కంపాస్ ధరలు

ఊహించని ధరతో ఎన్నో దిగ్గజ సంస్థలకు పెద్ద షాక్ ఇస్తూ జీప్ విడుదల చేసిన కంపాస్ ఎస్‌యూవీ సంచలనాత్మక విజయాన్ని అందుకుంది. అయితే, తమ మోస్ట్ పాపులర్ అండ్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ కంపాస్ ధర పెంచుతున్నట్లు జీప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Recommended Video

This McLaren 720S Costs Only 30 Bitcoins While Others Cost $285,000
జీప్ కంపాస్ ధరలు

జీప్ ఇండియా కంపాస్ మొత్తం ధరలో రెండు నుండి నాలుగు శాతం మేరకు పెంచే అవకాశం ఉంది. అయితే, ధరలు పెంపు కంపాస్‌లోని కేవలం టాప్ ఎండ్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది మరియు ప్రారంభ వేరియంట్లు అవే పాత ధరలతోనే లభ్యం కానున్నాయి.

జీప్ కంపాస్ ధరలు

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరక్టర్ కెవిన్ ఫ్లిన్ మాట్లాడుతూ, "విపణిలో పోటీతత్వమున్న ధరతో కంపాస్‌ను లాంచ్ చేయడంతో అత్యుత్తమ ఆదరణ లభించింది. అయితే, ఆర్థికపరమైన అనివార్య కారణాల రీత్యా కంపాస్‌లోని కొన్ని వేరియంట్ల మీద ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని పేర్కొన్నారు."

జీప్ కంపాస్ ధరలు

ఎంట్రీ లెవల్ వేరియంట్లు మినహా జీప్ కంపాస్ మీద 2 నుండి 4 శాతం మేర ధరల పెంపు అనంతరం, సవరించబడిన కొత్త ధరలు జనవరి 1, 2018 నుండి అమల్లోకి రానున్నాయి.

జీప్ కంపాస్ ధరలు

ప్రస్తుతం జీప్ కంపాస్ ఎంట్రీ లెవల్ వేరియంట్ స్పోర్ట్ పెట్రోల్ ధర రూ. 15.16 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. 2018 నుండి ఇదే ధర కొనసాగనుంది. అయితే, కంపాస్‌లోని లాంగిట్యూడ్ మరియు లిమిటెడ్ వేరియంట్ల మీద సుమారుగా రూ.80,000 ల వరకు ధర పెరిగే అవకాశం ఉంది.

జీప్ కంపాస్ ధరలు

జీప్ కంపాస్ లాంగిట్యూడ్ వేరియంట్ ధర రూ. 17.13 లక్షలు ఉండగా, లిమిటెడ్ వేరియంట్ ధర రూ. 18.68 లక్షల నుండి రూ. 21.73 లక్షల మధ్య ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

జీప్ కంపాస్ ధరలు

జీప్ తమ కంపాస్ మీద ధరల పెంపు ఇది రెండవసారి. గతంలో వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) అమల్లోకి వచ్చినపుడు కంపాస్ మీద సుమారుగా రూ. 72,000 ల వరకు ధర పెంపు జరిగింది.

జీప్ కంపాస్ ధరలు

జీప్ కంపాస్ ఎస్‌యూవీకి ఇండియన్ మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు నెలల కాలంలోనే 10,000 యూనిట్లకు పైగా కంపాస్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి.

జీప్ కంపాస్ ధరలు

అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రైట్ హ్యాండ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉన్న దేశాలకు రంజన్‌గావ్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేసే కంపాస్ ఎస్‌యూవీలను ఎగుమతి చేస్తోంది. దీంతో వరల్డ్ రైడ్ హ్యాండ్ డ్రైవింగ్ కంపాస్ వెహికల్ ప్రొడక్షన్‌కు రంజన్‌గావ్ ప్లాంట్ గ్లోబల్‌ హబ్‌‌గా మారింది.

జీప్ కంపాస్ ధరలు

జీప్ కంపాస్ ఇండియన్ మార్కెట్లో 1.4-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 2-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. వీటిలో పెట్రోల్ వెర్షన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ మరియు డీజల్ వెర్షన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తున్నాయి.

జీప్ కంపాస్ ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జీప్ ఇండియా తమ లేటెస్ట్ మోడల్ కంపాస్ మీద ధరలు పెంపును ప్రకటించింది. అయితే, ఈ పెంపు ప్రారంభ వేరియంట్లకు మినహాయింపు. విడుదలైనప్పటి నుండి జీప్ ఇండియాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిన కంపాస్ మీద ధరల పెంపు నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి.

Most Read Articles

Read more on: #jeep #జీప్
English summary
Read In Telugu: Jeep Compass To Cost More From 2018 — But There’s A Catch
Story first published: Friday, December 15, 2017, 17:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X