తొలి మేడిన్ ఇండియా జీప్ కంపాస్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేసిన జీప్

Written By:

జీప్ ఇండియా విభాగం దేశీయంగా ఉత్పత్తిని ప్రారంభించింది. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను చైనా, బ్రెజిల్ మరియు మెక్సికో వంటి మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. కుడి చేతి వైపు స్టీరింగ్ వీల్‌తో డ్రైవింగ్ సిస్టమ్ ఉన్న మార్కెట్లకు కావాల్సిన వాహనాలను ఉత్పత్తి చేసేందుకు జీప్‌ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏకైక ప్లాంటు రంజన్‌గాన్ ప్లాంటు.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్ ఎస్‌యూవీ

జీప్ సంస్థ తమ ప్లాంటులో తయారు చేసిన తొలి ఉత్పత్తి విడుదల కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ ప్రొడక్షన్ ప్లాంటులో జీప్ ఉత్పత్తి చేసిన తొలి ఉత్పత్తి ఇదే కావడం విశేషం.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్ ఎస్‌యూవీ

అమెరికాకు చెందిన జీప్ సంస్థ ఇండియన్ మార్కెట్లో సుమారుగా 280మిలియన్ డాలర్ల(మన కరెన్సీలో దీని విలువ రూ. 1,800 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. రంజన్‌గాన్ ప్లాంటులో జీప్ కంపాస్ తయారీ మరియు అభివృద్ది మీదకు ఈ పెట్టుబడులను మళ్లించింది.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్ ఎస్‌యూవీ

ఫియట్ క్లిస్లర్ ఆటోమొబైల్ ఇండియా విభాగపు మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రెసిడెంట్ కెవిన్ ఫ్లిన్ మాట్లాడుతూ, కంపాస్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. మేడిన్ ఇండియా కంపాస్ ఎస్‌యూవీని దేశీయ మరియు విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్ ఎస్‌యూవీ

కుడివైపు స్టీరింగ్ వీల్‌తో నడిపే వాహనాలకు ఇండియా ప్రసిద్దిగాంచిన సంగతి తెలిసిందే. అయితే జీప్ సంస్థ తమ శక్తివంతమైన కంపాస్ ఎస్‌యూవీని నాణ్యమైన ప్రమాణాలతో మేడియన్ ఇండియా చొరవతో ఉత్పత్తి చేస్తోంది. 2017 చివరి నుండి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నట్లు జీప్ తెలిపింది.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్ ఎస్‌యూవీ

జీప్ కంపాస్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఈ ప్లాంటును కేవలం 23 మాసాల్లో సకలసౌకర్యాలతో నిర్మించడం జరిగింది. జీప్ కంపాస్‌ ఎస్‌యూవీ ఉత్పత్తికి కావాల్సిన 65 శాతం విడి భాగాలను దేశీయంగానే ఉత్పత్తి చేస్తోంది.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్ ఎస్‌యూవీ

జీప్ సంస్థ అతి త్వరలో మోపార్(MOPAR) ను ప్రారంభించనున్నట్లు ఈ వేదిక మీద వెల్లడించింది. ఉత్పత్తులకు కావాల్సిన నాణ్యమైన స్పేర్ పార్ట్స్ మరియు కస్టమర్ సర్వీస్‌ను ఉద్దేశించి మోపార్‌ను ప్రారంభించనున్నారు.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్ ఎస్‌యూవీ

సాంకేతికంగా జీప్ కంపాస్‌ ఎస్‌యూవీలో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ వేరియంట్లు ఉన్నాయి.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్ ఎస్‌యూవీ

కంపాస్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 160బిహెచ్‌‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. అదే విధంగా 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న డీజల్ ఇంజన్ 170బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్ ఎస్‌యూవీ

జీప్ కంపాస్ ఎస్‌యూవీ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలదు, దీనికి అదనంగా టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ కూడా కలదు. రెండు ఇంధన వేరియంట్లలో లభించే కంపాస్‌లో స్నో, శాండ్ మరియు రాక్ డ్రైవింగ్ ఆప్షన్లు ఉన్నాయి.

Read more on: #జీప్ #jeep
English summary
Read In Telugu First Made In India Jeep Compass Rolls Off Production Line
Story first published: Saturday, June 3, 2017, 19:19 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark