పెట్రోల్ వేరియంట్ జీప్ వ్రాంగ్లర్ విడుదల: ధర మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు
ఫియట్ క్రిస్లర్ సంస్థ దేశీయంగా జీప్ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ పెట్రోల్ వేరియంట్ విడుదల చేసింది. డీజల్ వేరియంట్ కన్నా తక్కువ ధరతో విడుదలైన ఇది, దాని కన్నా ఎక్కువ శక్తివంతమైనదిగా జీప్ లైనప్‌లో నిలిచింది.
ఫియట్ క్రిస్లర్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి తమ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ మోడల్‌ను రూ. 56 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ధరతో పెట్రోల్ వేరియంట్లో విడుదల చేసింది. ఐదు డోర్లు గల అన్‌లిమిటెడ్ వెర్షన్‌లో మాత్రమే జీప్ వ్రాంగ్లర్ పెట్రోల్ వేరియంట్ అందుబాటులో ఉంది.

సాంకేతిక ఇందులో 3.6-లీటర్ల సామర్థ్యం గల వి6 పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 285బిహెచ్‌పి పవర్ మరియు 353ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

దీనికి అనుసందానం చేసిన 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ నాలుగు చక్రాలకు అందుతుంది.

జీప్ విడుదల చేసిన వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ పెట్రోల్ ఎస్‌యూవీకి దేశీయంగా ఎలాంటి ప్రత్యక్ష పోటీ లేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ అమ్మకాలకు గండి పడే అవకాశం ఉంది.

గతంలో జీప్ విడుదల చేసిన వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ డీజల్ ధర (రూ. 71.59 లక్షలు) కన్నా పెట్రోల్ వేరియంట్ ధర తక్కువగా ఉండటం గమనార్హం. మరియు పవర్ పరంగా డీజల్ ఇంజన్ కన్నా ఎక్కువగానే ఉత్పత్తి చేస్తుంది.

జీప్ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ డీజల్ వేరియంట్ 2.8-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 197బిహెచ్‌పి పవర్ మరియు 460ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

పెట్రోల్ వేరియంట్ తరహాలోనే ఈ డీజల్ వేరియంట్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ కలదు, స్టాండర్డ్‌గా ఆల్ డ్రైవ్ సిస్టమ్ అనుసంధానంతో నాలుగు చక్రాలకు ఇంజన్ పవర్ సరఫరా అవుతుంది.

జీప్ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ ఎస్‌యూవీకి చెందిన మరిన్ని ఫోటోలను చూడాలనుకుంటున్నారా...? అయితే క్రింది గల గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి.....


Click it and Unblock the Notifications








