కియా కార్లను విక్రయించేందుకు డీలర్ షిప్‌ ప్రారంభించాలనుకుంటున్నారా...?

Written By:

హ్యుందాయ్ మోటార్స్ భాగస్వామ్యపు సంస్థ, కియా మోటార్స్ దేశీయంగా అధికారిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. వివిధ దశలలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో డీలర్‌షిప్‌ల కోసం అవగాహన సదస్సులు నిర్వహించి, భవిష్యత్ డీలర్లను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కియా డీలర్‌షిప్‌లు

2017 ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు ప్రధాన నగరాల్లో డీలర్ షిప్‌ ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నవారు ఇందులో పాల్గొని కియా మోటార్స్ విక్రయకేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కియా మోటార్స్ పూర్తిగా కొత్త కంపెనీ కావడంతో కొత్తగా డీలర్ షిప్‌ ప్రారంభించేందుకు ఇదొక సదావకాశం అని చెప్పవచ్చు.

Recommended Video
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
కియా డీలర్‌షిప్‌లు

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కార్ల తయారీ ప్లాంటును నిర్మించడానికి మరియు దేశీయంగా కార్యకలాపాలను విసృతం చేసుకోవడానికి 110 కోట్ల రుపాయల పెట్టబడి పెట్టనున్నట్లు కియా మోటార్స్ ఇప్పటికే ప్రకటించింది.

కియా డీలర్‌షిప్‌లు

కియా డీలర్‌షిప్‌ల విషయానికి వస్తే, కియా కోసం కావాల్సిన ఫ్యూచర్ డీలర్ల కోసం కియా మోటార్స్ కియా డీలర్ రోడ్‌షో అనే సదస్సును ప్రారంభించడానికి సిద్దమైంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కియా విడుదల చేయనున్న కార్లు, వాటి విక్రయాలు, మరియు కస్టమర్ సర్వీస్ వంటి అనేక అంశాల పరంగా డీలర్లకు అవగాహన కల్పించనుంది.

కియా డీలర్‌షిప్‌లు

అంతేకాకుండా, కియా మోటార్స్ యొక్క భవిష్యత్ ప్రణాళికలు, పోటీగా ఉన్న సంస్థలను ఎదుర్కోవడానికి వ్యూహాలు మరియు కియా మోటర్స్ ఇండియా డీలర్ల సామ్రాజ్యం ఏర్పాటు గురించి డీలర్లకు మెళుకువలు నేర్పనుంది.

కియా డీలర్‌షిప్‌లు

కియా మోటార్స్ దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు ప్రధాన నగరాల్లో కియా డీలర్ రోడ్‌షో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అవి,

  • ఢిల్లీ - జెడబ్ల్యూ మారియట్ ఏరోసిటి, ఆగష్టు 8-9, 2017.
  • ముంబాయ్ - ఐటిసి మరాఠా, ఆగష్టు 16-17, 2017.
  • బెంగళూరు - తాజ్ వెస్ట్ ఎండ్, ఆగష్టు 23-24, 2017.
  • కలకత్తా - తాజ్ బెంగాల్, సెప్టెంబర్ 1, 2017.
కియా డీలర్‌షిప్‌లు

కియా మోటార్స్ జూలై 26, 2017 న అఫీషియల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఆటోమొబైల్ రంగంలో డీలర్‌షిప్ ప్రారంభించాలనుకునే ఔత్సాహికులు కియా డీలర్ రోడ్‌షో సదస్సులో పాల్గొనేందుకు www.kiaroadshoeindia.com వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకోగలరు.

కియా డీలర్‌షిప్‌లు

ఏప్రిల్ 2017 లో కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అనంతపురం జిల్లాలో సుమారుగా 536 ఎకరాల్లో ప్లాంటును నిర్మించనుంది. స్టాంపింగ్, వెల్డింగ్, పెయింటింగ్ మరియు అసెంబ్లీ వంటి విభాగాల ఏర్పాటుతో పూర్తి స్థాయిలో దేశీయంగానే కార్లను ఉత్పత్తి చేయనుంది. 2019 మధ్య భాగం నుండి కియా దేశీయ విపణిలోకి కార్లను ప్రవేశపెట్టనుంది.

కియా డీలర్‌షిప్‌లు

కియా మోటార్స్ తొలుత కాంపాక్ట్ సెడాన్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ తర్వాత హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. కియా మోటార్స్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ హెడ్ యాంగ్ ఎస్ కిమ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ విపణిలో తమ కియా కార్యకలాపాలను విస్తారించాలనుకున్నప్పుడు భారత్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపాడు.

కియా డీలర్‌షిప్‌లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా మోటార్స్ ప్రస్తుతం ప్రపంచ ఐదవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా ఉంది. అదే విధంగా 2020 నాటికి భారత దేశపు మూడవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా నిలవడానికి ప్రయత్నిస్తోంది. దాదాపు అన్ని సెగ్మెంట్లో ఎన్నో సంస్థలు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాయి. అయితే ధరకు విలువలతో మరియు అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో కియా కార్లు విపణిలోకి వస్తే, కియా ప్రణాళికలు ఫలించే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Kia Dealer Roadshow To Meet Prospective Dealers In India
Story first published: Friday, July 28, 2017, 13:14 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark