హ్యుందాయ్ క్రెటాకు పోటీని క్రియేట్ చేస్తున్న కియా మోటార్స్

Written By:

సౌత్ కొరియా అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ 2019 ప్రారంభం నాటికి ఇండియాలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. కియా మోటార్స్ భాగస్వామ్యపు సంస్థ హ్యుందాయ్‌కు చెందిన క్రెటాకు పోటీగా 2019 మలిసగంలో కొత్త ఎస్‌యూవీని విడుదల చేయనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
 కియా మోటార్స్

కియా మోటార్స్ కార్పోరేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ మరియు ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, తేయ్ హ్యూన్ ఓహ్ మాట్లాడుతూ, కియా మోటార్స్ మూడు కొత్త ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు.

 కియా మోటార్స్

తొలి మూడు మోడళ్లలో మొదటిది మిడ్-సైజ్ ఎస్‌యూవీ అని తెలిసింది. కియా మోటార్స్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీనివ్వనుంది. దీని తర్వాత ఉన్న హ్యాచ్‌బ్యాక్, సెడాన్ సెగ్మెంట్ల మీద దృష్టిసారించనుంది.

 కియా మోటార్స్

తక్కువ ధరతో అందుబాటులో ఉంచేందుకు మిడ్-సైజ్ ఎస్‌యూవీ విడి పరికరాలు సేకరణ మరియు తయారీ మొత్తం ఇండియాలోనే జరగనుంది. దీని ద్వారా పోటీగా ఉన్న ఉత్పత్తుల కంటే తక్కువ ధరతో లభిస్తాయి.

 కియా మోటార్స్

ఇండియాలో విడుదల చేయాల్సిన ఉత్పత్తుల జాబితాను కియా మోటార్స్ ఇప్పటికే ఖరారు చేసింది. ప్రస్తుతం డీలర్ల నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలలో కియా మోటార్స్ తమ ఉత్పత్తులను ప్రదర్షిస్తోంది.

 కియా మోటార్స్

వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద కియా మోటార్స్ నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరించనుంది. అంతే కాకుండా, కాంపాక్ట్ ఎస్‌‌యూవీ మరియు సెడాన్ లతో పాటు అత్యంత ఖరీదైన లగ్జరీ వాహనాలను కూడా విడుదల అవకాశాలు ఉన్నాయి.

 కియా మోటార్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం కియా మోటార్స్ నుండి వస్తున్న సమాచారం చూస్తే, ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లో ఉన్న అన్ని సెగ్మెంట్లో తమ ఉత్పత్తులను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే కనుక జరిగితే, దేశీయంగా బడా కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది.

English summary
Read In Telugu: Kia Motors To Launch Hyundai Creta Rival In India
Story first published: Friday, August 11, 2017, 9:45 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark