ఇండియాలో రోడ్ షో ద్వారా నాలుగు కార్లను ప్రదర్శించిన కియా మోటార్స్

Written By:

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ దేశీయంగా అధికారిక కార్యకలాపాలను వేగవంతం చేసింది. డీలర్లను చేర్చుకునేందుకు రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించిన కియా మోటార్స్ నాలుగు మోడళ్లను ప్రదర్శించింది.

కియా మోటార్స్ కార్లు

కియా అంతర్జాతీయ విపణిలో ఉన్న పికంటో హ్యాచ్‌బ్యాక్, సెరాటో సెడాన్, సొరెంటో మరియు స్పోర్టేజ్ ఎస్‌యూవీలను ప్రదర్శించింది. కియా ఉత్పత్తుల గురించి డీలర్లకు అవహగాహన కల్పించడం మరియు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లతో ఇవి ఎలా పోటీపడనున్నాయి వంటి అంశాల వారీగా చర్చించి డీలర్లను చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది కియా మోటార్స్.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
కియా మోటార్స్ కార్లు

కియా పికంటో లేటెస్ట్ వెర్షన్‌ను ఈ ఏడాది జరిగిన జెనీవా మోటార్ వేదిక మీద ప్రదర్శించబడింది. ఫ్రంట్ డిజైన్‌లో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, సింగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్ ఇందులో కలదు.

కియా మోటార్స్ కార్లు

పికంటో హ్యాచ్‌బ్యాక్‌లో ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్, ఆంగ్లపు సి ఆకారంలో ఉన్న టెయిల్ లైట్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు ఏ/సి వెంట్స్ ఉన్నాయి.

కియా మోటార్స్ కార్లు

కియా మోటార్స్ పికంటో హ్యాచ్‌బ్యాక్‌ను మూడు పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో విడుదల చేసే అవకాశం ఉంది. వీటిలో 1.0-లీటర్, 1.25-లీటర్ మరియు టుర్బో ఛార్జ్‌డ్ వెర్షన్ 1.0-లీటర్ ఇంజన్‌లతో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో రానున్నాయి.

కియా మోటార్స్ కార్లు

కియా మోటార్స్ తమ భాగస్వామ్యపు సంస్థ గ్రాండ్ ఐ10 నుండి విడి పరికరాలను సేకరించి పికంటోలో అందివ్వనుంది. 2019 ప్రారంభం నాటికి కియా మోటార్స్ తమ తొలి ఉత్పత్తిగా పికంటో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది.

కియా మోటార్స్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా మోటార్స్ ప్రస్తుత ప్రణాళికల ప్రకారం 2019 ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో అధికారిక కార్యకలాపాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. హ్యుందాయ్ మరియు కియా మోటార్స్ ఉమ్మడి భాగస్వామ్యంతో తయారీ మరియు సేల్స్ మారుతికి గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Kia Showcases Its Products In India At Roadshow

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark