భారత్‌కు కియా స్టోనిక్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

Written By:

కియా మోటార్స్ ఏడాదిలో తమ స్టోనిక్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించి, 2017 చివరి నాటికి అంతర్జాతీయ విపణిలో విక్రయాలకు సిద్దం చేస్తోంది. ప్రస్తుతం కియా వద్ద డిజైన్ ఫిలాసఫీలో స్టోనిక్ డిజైన్ కీలక పాత్ర పోషించనుంది మరియు కియా వద్ద ఇది వరకే ఉన్న అదే ఫ్రంట్ గ్రిల్ మరియు హెడ్ ల్యాంప్ క్లస్టర్‌ను ఇందులో అందివ్వనుంది.

కియా స్టోనిక్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

అధిగ గ్రౌండ్ క్లియరెన్స్, పదునైన మరియు కండలు తిరిగిన డిజైన్ లక్షణాలున్నాయి. రూఫ్ టాప్ మరియు బాడీని కలిపే ఏ మరియు బి పిల్లర్లు కూడా పదునైన రూపంలో ఉండటం గమనార్హం. అత్యుత్తమ పవర్ ఉత్పత్తినిచ్చేందుకు స్పోర్టివ్ ఢిప్యూసర్ అందివ్వడం జరిగింది.

కియా స్టోనిక్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

కియా మోటార్స్ ఈ స్టోనిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మహీంద్రా టియువి300 మరియు త్వరలో టాటా నుండి రానున్న నెక్సాన్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

కియా స్టోనిక్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

స్టోనిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ విషయానికి వస్తే, అత్యధిక ఆడంబరాలకు పోకుండా సింపుల్‌గా, ఆకర్షణీయంగా మరియు ఇంపైన సొబగులతో బ్లాక్ మరియు గ్రే ఫినిషింగ్ గల ఇంటీరియర్ కలదు. కియా వద్ద కొనసాగుతూ వస్తోన్న ట్రెడిషన్ స్టీరింగ్ వీల్, సెంట్రల్ కన్సోల్ మరియు ఆరేంజ్ తొడుగులను గుర్తించవచ్చు.

కియా స్టోనిక్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

డ్యాష్ బోర్డ్ మీద సెంటర్ కన్సోల్ వద్ద ఓ స్క్రీన్ కలదు, ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అని తెలుస్తోంది. సిల్వర్ డిజైన్ ఎలిమెంట్లలో ఉన్న రెండు పెద్ద నాబ్స్(గుండ్రంగా తిప్పే వీలున్న) ఉన్నాయి. వీటి ద్వారా డిస్ల్పే మరియు టెంపరేచర్ నియంత్రించవచ్చు.

కియా స్టోనిక్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

స్టోనిక్ ఎస్‌యూవీని కస్టమర్లు తమ అభిరుచికి తగ్గట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చని కియా తెలిపింది. కాబట్టి ఆప్షనల్‌గా వీల్స్, డీకాల్స్ మరియు వివిధ రకాల రంగుల్లో స్టోనిక్ ఎస్‌యూవీ సెలక్ట్ చేసుకోవచ్చు.

కియా స్టోనిక్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీ

పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన ఆప్షన్‌లతో పాటు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో కూడా స్టోనిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకురానున్నట్లు కియా మోటార్స్ తెలిపింది.

English summary
Read In Telugu To Know More Kia Previews Stonic Compact SUV; Could Make Its Way To India
Story first published: Friday, June 9, 2017, 11:05 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark