భారత్‌కు కియా మోటార్స్ అవసరాన్ని తెలిపే కారణాలు!

Written By:

హ్యుందాయ్‌కు చెందిన కియా మోటార్స్‌ ఇండియా రాకపై దేశవ్యాప్తంగా అందరికీ తెసిందే. అయితే ఇండియాకు కియా మోటార్స్ చాలా ముఖ్యమైనది. దీని అవసరం భారత్‌కు అధికంగానే ఉంది. ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమలో 50 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకు మారుతి సుజుకి ఉన్నపుడు కియా అంత ఇంపార్టెంట్ ఎందుకు?

భారత్‌కు కియా మోటార్స్ అవసరం

హ్యందాయ్ మోటార్స్ దేశీయ రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల సంస్థగా నిలిచింది. అంతే కాకుండా మంచి బ్రాండ్ వ్యాల్యూ సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది హ్యుందాయ్. ఈ తరుణంలో కియా ఇండియాకు రానుండటంతో హ్యుందాయ్ కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉంది.

భారత్‌కు కియా మోటార్స్ అవసరం

ప్రపంచ వ్యాప్తంగా కియా గుర్తింపును పెంచుకోవడం మరియు భారత్ మంచి లాభదాయకమైన మార్కెట్ కావడంతో కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దం అవుతోంది.

భారత్‌కు కియా మోటార్స్ అవసరం

భారత్‌కు కియా మోటార్స్ అవసరానికి గల కారణాల గురించి తెసుకోవడానికి ముందు కియా గురించి చూద్దాం రండి: కియా మోటార్స్ దక్షిణ కొరియాలో రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ. మరియు గడిచిన 2015 లో 3.3 మిలియన్ యూనిట్ల కార్లను విక్రయించింది.

భారత్‌కు కియా మోటార్స్ అవసరం

కియా ప్రారంభంలో సైకిళ్ల తయారీ సంస్థగా అవతరించి తరువాత ఆటోమొబైల్ తయారీ సంస్థగా రూపాంతరం చెందింది. ఇప్పుడు దక్షిణ కొరియాతో పాటు అమెరికా, ఐరోపా, మెక్సికో, చైనా మరియు వియత్నాం వంటి దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

భారత్‌కు కియా మోటార్స్ అవసరం

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో కియా యొక్క విపరీతమైన పెరుగుదల కారణంగా, జె.డి పవర్ 2017 కు గాను అమెరికాలో వాహనాల యొక్క ప్రాథమిక నాణ్యతపరంగా కియా మోటార్స్ మొదటి స్థానంలో నిలిచింది. 2016లో కూడా కియానే తొలిస్థానంలో ఉంది. కియా తరహా అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులు అందించే కంపెనీ అవసరం ఇండియాకు ఎంతో ఉంది.

భారత్‌కు కియా మోటార్స్ అవసరం

జె.డి పవర్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ డేవ్ సార్జెంట్ మాట్లాడుతూ, "కస్టమర్లు అభిప్రాయాలను సేకరించి, వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ఎప్పుటికప్పుడు నాణ్యంగా ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపాడు."

భారత్‌కు కియా మోటార్స్ అవసరం

కారు కొన్న తొలి రోజు నుండి 90 రోజుల వరకు, తొలి 100 కార్లకు వాహనం యొక్క ప్రారంభ నాణ్యతను పరీక్షించడం జరుగుతుంది. ఈ తరుణంలో తక్కువ లోపాలు మరియు సమస్యలు వచ్చినట్లయితే, ఈ వాహనాల యొక్క ప్రారంభ నాణ్యత బాగా ఉన్నట్లు అర్థం.

భారత్‌కు కియా మోటార్స్ అవసరం

ఇలా కియా మోటార్స్ ప్రారంభ నాణ్యత పరంగా ఎక్కువ మార్కులు సాధించి వరుసగా రెండో సంవత్సరం కూడా అమెరికాలో తొలి స్థానంలో నిలిచింది. కియా నాణ్యతకు అధిక ప్రాధాన్యతనమివ్వడంతో ఇండియాకు కియా అవసరం ఉందని చెప్పాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పైపై మెరుగులతో, ఆకర్షణీయంగా తయారీ సంస్థలను కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రతి రోజూ కొన్ని వేల కొత్త కార్లు రోడ్డెక్కుతున్నాయి. కానీ వాటిలో నాణ్యతకు దూరంగా ఎన్నో ఉత్పత్తలు ఉన్నాయి. అందుకే కియా మోటార్స్ అవసరం భారత్‌కు ఎంతైనా ఉంది.

English summary
Read In Telugu Here Is One Reason Why India Needs Kia Motors
Story first published: Friday, June 23, 2017, 17:25 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark