అవెంతడోర్ ఎస్ ఇండియా విడుదలపై స్పష్టత

లాంబోర్గిని తమ అవెంతడోర్ ఎస్ సూపర్ కార్ ఇండియా విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేసింది. మార్చి 3, 2017 క్యాలెండర్ తేదీన అవెంతడోర్ ఎస్ విడుదలకు లాంబోర్గిని సన్నాహాలు చేస్తోంది.

By Anil

ప్రపంచ విపణిలోకి సరిగ్గా మూడు నెలల క్రితం ఓ సూపర్ కారును విడుదల చేసిన లాంబోర్గిని ఇప్పుడు అవెంతడోర్ ఎస్ వేరియంట్‌ను ఇండియా విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. దీని సాంకేతిక వివరాలు, ఫీచర్లు మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం రండి.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

లాంబోర్గిని చివరి సారిగా డిసెంబర్ 19, 2016 న తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఇప్పుడు సరిగ్గా రెండు నెలల అనంతరం అవెంతడోర్ ఎస్ ఇండియా విడుదలకు సిద్దం చేస్తోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అమ్మకాల్లో ఉన్న సాధారణ అవెంతడోర్ కన్నా అత్యంత పదునైన డిజైన్ ఫీచర్లతో మరియు మరింత శక్తివంతంగా రానుంది.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

సాంకేతికంగా లాంబోర్గిని అవెంతడోర్ ఎస్ వేరియంట్లో 6.5-లీటర్ సామర్థ్యం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 ఇంజన్ కలదు. ఇది 8,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 730బిహెచ్‌పి పవర్ మరియు 690ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ పవర్ మరియు టార్క్‌ని నాలుగు చక్రాలకు సరఫరా చేస్తుంది.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

ఇందులో మరింత శక్తివంతమైన ఇంజన్ అందివ్వడం ద్వారా బరువుకు పవర్‌కు మధ్య గల నిష్పతిని చూసుకుంటే ఒక టన్ను బరువుకు సగటున 463బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

ఈ అవెంతడోర్ ఎస్ వేరియంట్ కేవలం 2.9 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది, మరియు దీని గరిష్ట వేగం గంటకు 349కిలోమీటర్లుగా ఉంది.

అవెంతడోర్ ఎస్

సరికొత్త అవెంతడోర్ ఎస్ వేరియంట్ ఫ్రంట్ డిజైన్ మునుపటి వేరియంట్ కన్నా చాలా అగ్రెసివ్‌గా ఉంది. పెద్ద ఎయిర్‌ ఇంటేకర్ ఇముడింపుతో దీని ముక్కు భాగాన్ని అత్యంత పదునుగా తీర్చిదిద్దడం జరిగింది.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

వెనుక వైపు రెక్కలను మూడు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. గాలి ద్వారా కలిగే ఘర్షణ నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా డిఫ్యూసర్ ను మరింత అగ్రెసివ్ శైలిలో రూపొందించారు.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్ కు చెందిన మరిన్ని ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.... వీటిలో మీకు నచ్చిన ఫోటోలను పూర్తి ఉచితంగా డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, February 23, 2017, 10:42 [IST]
English summary
Lamborghini Aventador S India Launch Date Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+