రూ. 5.01 కోట్ల ప్రారంభ ధరతో అవెంతడోర్ ఎస్ విడుదల చేసిన లాంబోర్గిని

దిగ్గజ సూపర్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గిని ఇండియన్ మార్కెట్లోకి అవెంతడోర్ ఎస్ కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 5.01 కోట్లుగా ఉంది.

By Anil

ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గిని తమ అవెంతడోర్ ఎస్ కారును ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 5.01 కోట్లు ఎక్స్ షోరూమ్(ముంబాయ్)గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. సరిగ్గా మూడు నెలల క్రితం లాంబోర్గిని ఈ అవెంతడోర్ ఎస్ వేరియంట్‌ను ఆవిష్కరించగా ఇప్పుడు పూర్తి స్థాయి కొనుగోళ్లకు సిద్దంగా అందుబాటులోకి తెచ్చింది.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

లాంబోర్గిని విడుదల చేసిన నూతన అవెంతడోర్ ఎస్ ఇప్పుడు మునుపటి వేరియంట్‌ కన్నా మరింత శక్తివంతమైనది. ఇందులో 6.5-లీటర్ సామర్థ్యం గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 ఇంజన్ కలదు.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 8,500ఆర్‌పిఎమ్(నిమిషానికి ఇంజన్‌లోని షాఫ్ట్ తిరిగే చుట్లు) వద్ద గరిష్టంగా 730బిహెచ్‌పి పవర్ మరియు 690ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి అనుసంధానం చేసిన 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ సరఫరా అవుతుంది.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్ వేరియంట్ కేవలం 2.9 సెకండ్ల కాల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 350కిలోమీటర్లుగా ఉంది.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్ లో నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను పరిచయం చేసింది. అవి, స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా మరియు ఇగో పేరుతో పిలవబడే సరికొత్త ఇండివిడ్యువల్ సెట్టింగ్ వంటివి ఇందులో ఉన్నాయి.

డిజైన్

డిజైన్

గతంలో ఉన్న వేరియంట్‌ కన్నా ఇది మరియు అగ్రెసివ్ డిజైన్ కలిగి ఉంది. రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ డిజైన్ ద్వారా ఎక్కువ గాలిని గ్రహించే ఎయిర్ ఇంటేకర్ కలదు. మరియు రీ డిజైన్ చేయబడిన ఏరో ఎలిమెంట్ల ద్వారా డౌన్ ఫోర్స్ 130శాతం వరకు పెరిగింది.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

వెనుక వైపున, కావాల్సిన డౌన్ ఫోర్స్‌కు అనుగుణంగా ముడుచుకునే అవకాశం ఉన్న స్పాయిలర్‌ను మూడు దశలో సెట్టింగ్ చేసుకునే ఫీచర్ కలదు, వెనుక వైపున ఢిఫ్యూసర్‌ వద్ద వి12 ఇంజన్ ఉత్పత్తి చేసే ఉద్గారాలను వెలువరించడానికి మూడు ఎగ్జాస్ట్ గొట్టాలున్నాయి.

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్

లాంబోర్గిని అవెంతడోర్ ఎస్ సూపర్ కార్ యొక్క మరిన్ని ఫోటోల క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

More from DriveSpark

Article Published On: Friday, March 3, 2017, 14:54 [IST]
English summary
Lamborghini Aventador S Launched In India At Rs 5.01 Crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+