విపణిలోకి ల్యాంబోర్గిని హురాకాన్ ఆర్డబ్ల్యూడి స్పైడర్ విడుదల ధర మరియు ఇతర వివరాలు
ల్యాంబోర్గిని, Lamborghini
ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన ఐదవ హురాకాన్ ఆర్డబ్ల్యూడి స్పైడర్ స్పైడర్ యొక్క ప్రారంభ ధర రూ. 3.45 కోట్లు ఎక్స్ షోరూమ్ ముంబాయ్‌గా విడుదల చేసింది. ఐదవ ల్యాంబోర్గిని ఇండియాలోకి విడుదల చేయడానికి నెల రోజుల క్రితమే యూరోపియన్ మార్కెట్లో నూతన హురాకాన్ స్పైడర్‌ను విడుదలచేసింది.

ల్యాంబోర్గిని ఇందులో 5.2-లీటర్ సామర్థ్యం గల వి10 పెట్రోల్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 572బిహెచ్‌పి పవర్ మరియు 540ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఈ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు అందుతుంది.

కేవలం వెనుక చక్రాల ద్వారా మాత్రమే నడిచే ఈ హురాకాన్ ఆర్‌డబ్ల్యూడి బరువు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గల హురాకాన్ బరువు కన్నా 33 కిలోలు తక్కువగా ఉంటుంది.

లైట్ వెయిట్ హురాకాన్ స్పైడర్ కేవలం 3.6 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 319 కిలోమీటర్లుగా ఉంది.

ల్యాంబోర్గిని హురాకాన్ ఆర్డబ్ల్యూడి స్పైడర్ ముందు వైపున రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్ ద్వారా ముందు వైపు మరింత అగ్రెసివ్ డిజైన్ సాధ్యమైంది.

సరికొత్త హురాకాన్ ఆర్డబ్ల్యూడి స్పైడర్ లో ఉన్న 19-అంగుళాల అల్లాయ్ చక్రాలకు పిరెల్లీ జీరో టైర్లను అందివ్వడం జరిగింది, బ్రేకింగ్‌లో కీలక పాత్ర వహించే స్టీల్ బ్రేకులను అందివ్వడం జరిగింది.

ల్యాబోర్గిని కార్లలో కామన్ గా వచ్చే ప్రత్యేకత రూఫ్ టాప్. ఫ్యాబ్రిక్ పదార్థంతో తయారు చేసిన ఈ రూఫ్ టాప్ గంటకు 50కిమీల వేగం వద్ద ఉన్నపుడు కేవలం 17 సెకండ్లలోనే ఒపెన్ మరియు క్లోజ్ అవుతుంది.

ఇంటీరియర్‌లో 12.3-అగుళాల పరిమాణం గల డిస్ల్పే కలదు, లెథర్ సీట్లు గల ఇందులో ల్యాంబోర్గిని అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

ల్యాంబోర్గిని స్పైడర్ ఆర్‌డబ్ల్యూడి స్పైడర్ ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న పోర్షే 911 టుర్బో ఎస్ క్యాబ్రియోలెట్ మరియు ఫెరారి కాలిఫోర్నియా టి కార్లకు గట్టి పోటీనివ్వగలదు.

మారుతి నుండి లిమిటెడ్ ఎడిషన్ మోడిఫైడ్ వితారా బ్రిజా


Click it and Unblock the Notifications








