అధికారికంగా లెక్సస్ వచ్చేసింది: కొత్త కార్లు మరియు వాటి ధరల కోసం...

Written By:

లెక్సస్ కార్ల తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. రెండు కార్లతో విచ్చేసిన లెక్సస్ లగ్జరీ కార్ల తయారీ సంస్థకు ఇండియా నుండి స్వాగతం పలుకుతూ, ఈ రెండు కార్లకు చెందిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి...

రెండు కార్లతో అధికారికంగా విచ్చేసిన లెక్సస్ కార్ల కంపెనీ

లెక్సస్ ఇండియా విభాగం అధికారిక ప్రారంభ వేడుక మీద ఎల్ఎక్స్450డి మరియు ఆర్ఎక్స్450హెచ్ లగ్జరీ ఎస్‌యూవీ వాహనాలను విడుదల చేసింది.

రెండు కార్లతో అధికారికంగా విచ్చేసిన లెక్సస్ కార్ల కంపెనీ
  • లెక్సస్ ఆర్ఎక్స్ 450హెచ్ ధర రూ. 1.07 కోట్లు,
  • ఎఫ్-స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 1.10 కోట్లు,
  • మరియు సంస్థ యొక్క లగ్జరీ సెడాన్ ఇఎస్300హె హైబ్రిడ్ ధర రూ. 55.27 లక్షలు.
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

అయితే తమ ఎల్ఎక్స్ 450డి ఎస్‌యూవీ ధరను వెల్లడించడానికి లెక్సస్ నిరాకరించింది.

రెండు కార్లతో అధికారికంగా విచ్చేసిన లెక్సస్ కార్ల కంపెనీ

మూడు మోడళ్లు కూడా కంప్లిట్లి బిల్ట్ యూనిట్‌గా అందుబాటులో ఉన్నాయి. విదేశాల్లో తయారయ్యే వీటిని మార్కెట్లోకి దిగుమతి చేసుకుని విక్రయాలకు అందుబాటులో ఉంచింది లెక్సస్.

రెండు కార్లతో అధికారికంగా విచ్చేసిన లెక్సస్ కార్ల కంపెనీ

ఎల్ఎక్స్450డి ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇది టయోటా ల్యాండ్ క్రూయిజర్ యొక్క అడ్వాన్స్‌డ్ వెర్షన్ అని చెప్పవచ్చు. ప్రాథమిక డిజైన్ పరంగా ఇది ల్యాండ్ క్రూయిజర్‌ను పోలి ఉంటుంది. సాంకేతికంగా లెక్సస్ ఇందులో 272బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 4.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు.

రెండు కార్లతో అధికారికంగా విచ్చేసిన లెక్సస్ కార్ల కంపెనీ

అతి తక్కవ ధరతో మొదలయ్యే ఇఎస్300హెచ్ హైబ్రిడ్ సెడాన్ విషయానికి వస్తే, దీనిని టయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఆధారంగా నిర్మించడం జరిగింది. అయితే లెక్సస్ ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇంటీరియర్ మరియు లగ్జరీ ఫీచర్లను అందివ్వడం జరిగింది.

రెండు కార్లతో అధికారికంగా విచ్చేసిన లెక్సస్ కార్ల కంపెనీ

సాంకేతికంగా ఇఎస్300హెచ్ హైబ్రిడ్ సెడాన్ కారులో 2.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో కలదు. పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండూ సంయుక్తంగా ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ సివిటి (ఆటోమేటిక్) గేర్‌బాక్స్ ద్వారా చక్రాలకు అందుతుంది.

రెండు కార్లతో అధికారికంగా విచ్చేసిన లెక్సస్ కార్ల కంపెనీ

లెక్సస్ ఇండియా లైనప్‌లో టాంప్ ఎండ్ వేరియంట్‌గా చెప్పుకునే ఆర్ఎక్స్450హెచ్ మిడ్ రేంజ్ ఎస్‌యూవీ డిజైన్ పరంగా లెక్సస్ మరియు టయోటా లైనప్‌లో ఉన్న వాటితో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంటుంది.

రెండు కార్లతో అధికారికంగా విచ్చేసిన లెక్సస్ కార్ల కంపెనీ

సాంకేతికంగా లెక్సస్ సంస్థ ఇందులో 3.5-లీటర్ సామర్థ్యం గల న్యాచురల్లీ వి6 ఇంజన్ కలదు. ఇందులోని ఇంజన్‌ మరియు దీనికి అనుసంధానించిన హైబ్రిడ్ వ్యవస్థ సంయుక్తంగా 308బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేయును.

రెండు కార్లతో అధికారికంగా విచ్చేసిన లెక్సస్ కార్ల కంపెనీ

లెక్సస్ విడుదల చేసిన ఉత్పత్తులను ధరల పరంగా చూస్తే, ప్రస్తుతం లగ్జరీ కార్ల మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, జాగ్వార్ మరియు వోల్వో వంటి కార్లతో బలమైన పోటీని ఎదుర్కోనున్నాయి.

రెండు కార్లతో అధికారికంగా విచ్చేసిన లెక్సస్ కార్ల కంపెనీ

దిగ్గజ "రోల్స్ రాయిస్" కార్ల తయారీ కంపెనీ చేత క్షమాపణ చెప్పించుకునేట్లు చేసిన ఓ భారతీయ రాజు కథ ఇది.... మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...

English summary
Lexus Launches RX And ES In India — Prices Start At Rs 55.27 Lakh, Lexus official launch in india read in telugu. lexus launch details in telugu.
Story first published: Saturday, March 25, 2017, 17:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark