ఎలక్ట్రిక్ వేరియంట్లో మహీంద్రా కెయువి100
మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ వెహికల్ విడుదల గురించిన వివరాలను వెల్లడించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా తమ కెయువి100 ఎస్‌యూవీ ఎన్‌ఎక్స్‌టి ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో అత్యంత సరసమైన ధరతో విడుదల చేసింది. ఇదే వేదిక మీద కెయువి100 ఎలక్ట్రిక్ వెహికల్ విడుదల గురించిన వివరాలను వెల్లడించింది.

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ, "2018 చివరిలో లేదా 2019 ప్రారంభంలో తమ కెయువి100 మైక్రో ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపాడు."

భారతదేశపు మరియు కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మహీంద్రా కెయువి100 స్థానం సంపాదించుకోనుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ విభాగం ప్రస్తుతం ఇ2ఒ ప్లస్, ఇ-వెరిటో మరియు ఇ-సుప్రో వాహనాలను ఎలక్ట్రిక్ వేరియంట్లో విక్రయిస్తోంది.
Recommended Video


భారతదేశపు మరియు కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మహీంద్రా కెయువి100 స్థానం సంపాదించుకోనుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ విభాగం ప్రస్తుతం ఇ2ఒ ప్లస్, ఇ-వెరిటో మరియు ఇ-సుప్రో వాహనాలను ఎలక్ట్రిక్ వేరియంట్లో విక్రయిస్తోంది.

మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమేటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ రాజన్ వాదేరా మాట్లాడుతూ, "మహీంద్రా కెయువి100 సరికొత్త ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్‌తో రానుంది." అంటే, ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్ సిస్టమ్‌లను తమ భవిష్యత్తు మోడళ్లలో వినియోగించే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
వాహన పరిశ్రమలో ఒక్కో విభాగానికి ఒక్కో సంస్థ ప్రత్యేకం. కానీ మహీంద్రా అండ్ మహీంద్రా ఇందుకు పూర్తిగా విభిన్నం. టూ వీలర్లు, కార్లు, ఎస్‌యూవీలు, కమర్షియల్ వెహికల్, బస్సులు, లారీలు ట్రక్కులు, బోట్లు, నౌకలు, చివరికి విమానాల తయారీ రంగంలోకి ప్రవేశించింది.
విభిన్నంగా అన్ని రకాల తమ ఉనికిని నెలకొల్పుతోంది. అదే రీతిలో ఇండియన్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఏకైక సంస్థగా నిలిచింది. భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ రవాణా మీదకు మళ్లుతుండటంతో ఇప్పటి నుండి విభిన్న మోడళ్లను అభివృద్ది చేయడానికి మహీంద్రా ప్రయత్నిస్తోంది.
కాబట్టి, తమ మైక్రో ఎస్‌యూవీ కెయువి100ను పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వెహికల్‌గా రూపొందించడానికి ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications








