దూసుకొస్తున్న మహీంద్రా టియూవీ300 ప్లస్ 7 సీటర్: ఇన్నోవా క్రిస్టాకు చుక్కలే...!!

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా గత కొంత కాలంగా కొన్ని మోడళ్లను ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తూ వచ్చింది. వరుసగా మూడు వెహికల్స్‌ను పరీక్షిస్తూ వచ్చిన మహీంద్రా... వాటిలో ఒకటి టయోటా ఇన్నోవా క్రిస్టా వాహనానికి పోటీ అని పరోక్షంగా స్పష్టం చేసింది.

మహీంద్రా టియూవీ300 ప్లస్

మహీంద్రా పలు దఫాలుగా పరీక్షించిన కొత్త మోడళ్లు మీడియా కంటపడిన, వాటిలో పొడగించబడిన బాడీ గల టియూవీ300 ఉంది. మహీంద్రా దీనిని టియూవీ500 అనే పేరుతో విడుదల చేస్తుంది అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా మహీంద్రా దీనికి టియూవీ300 ప్లస్ అనే పేరును రిజిస్టర్ చేయించింది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మహీంద్రా టియూవీ300 ప్లస్

మహీంద్రా టియూవీ300 యొక్క పొడవాటి వెర్షన్ టియూవీ300 ప్లస్ ను రహస్యంగా పరీక్షిస్తున్నపుడు డ్రైవ్‌స్పార్క్ గుర్తించింది. బాక్స్ రూపంలో ఉన్న క్యాబిన్, స్క్వయర్ ఆకారంలో ఉన్న వీల్ అర్చెస్‌తో పాటు టియూవీ300 కు చెందిన ఎన్నో డిజైన్ ఎలిమెంట్లను కలిగి ఉంది.

మహీంద్రా టియూవీ300 ప్లస్

ఎక్ట్సీరియర్ పరంగా పొడగించబడిన బాడీని మినహాయిస్తే మిగతా మార్పులు అంతగా గుర్తించలేము. అయితే ఇంటీరియర్‌లో భారీ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ గల ఇంటీరియర్, న్యావిగేషన్ మరియు ఇతర అప్లికేషన్లను సపోర్ట్ చేయగల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ప్రీమియమ్ ఫీల్ కలిగించేందుకు ఎక్స్‌యూవీ500 లోని కొన్ని ఇంటీరియర్ ఎలిమెంట్లకు ఇందులో స్థానం కల్పించనుంది.

మహీంద్రా టియూవీ300 ప్లస్

ఇంజన్ విషయానికి వస్తే, రెండు రకాల ఇంజన్‌లను వినియోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం టియూవీ300 లో ఉన్న అదే 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ లేదంటే అధిక పవర్ కోసం స్కార్పియోలో ఉన్న 2.2-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ అందించే అవకాశం ఉంది.

మహీంద్రా టియూవీ300 ప్లస్

ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి మహీంద్రా ఈ టియూవీ300 ప్లస్ ఎమ్‌పీవీ వాహనాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. దీని అనంతరం మహీంద్రా పరీక్షిస్తున్న కెయువి100 ఫేస్‌లిఫ్ట్ విడుదల కూడా ఉండనుంది.

మహీంద్రా టియూవీ300 ప్లస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2002లో స్కార్పియో వాహనాన్ని విడుదల చేసినప్పటి నుండి ఎస్‌యూవీ సెగ్మెంట్లో మహీంద్రా సింహ భాగంలో ఉంది. అయితే రోజులు మారేకొద్ది అన్ని తయారీ సంస్థలు ఎస్‌యూవీలను విడుదల చేయడం ప్రారంభించాయి. దీంతో మహీంద్రా తన స్థానాన్ని పధిలం చేసుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల అభివృద్ది మరియు విడుదల మీద దృష్టిసారిస్తోంది.

మహీంద్రా లైనప్‌లో ఉన్న టియూవీ300 వెహికల్ మంచి ఫలితాలు సాధించిపెడుతోంది. కాబట్టి పెద్ద పరిమాణంలో వస్తోన్న టియూవీ300 ప్లస్ వేరియంట్ కూడా అదే తరహా ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Mahindra Trademarks ‘TUV300 Plus’ Name

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark