మహీంద్రా టియువి300 టి10 విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు...

Written By:

దేశీయ వాహన తయారీ పరిశ్రమలో ఎస్‌యూవీల తయారీలో మేటి సంస్థగా రాణిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా టియువి300 ఎస్‌యూవీ వాహనాన్ని టి10 వేరియంట్లో నేడు విపణిలోకి విడుదల చేసింది.

మహీంద్రా టియువి300 టి10 విడుదల

టియువి300 టి10 వేరియంట్ టి10, టి10 డ్యూయల్ టోన్, టి10 ఆటోమేటిక్ మరియు టి10 ఆటోమేటిక్ డ్యూయల్ టోన్ అనే నాలుగు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. టియువి టి10 ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.75 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 10.65 లక్షలుగా ఉంది.

మహీంద్రా టియువి300 టి10 విడుదల

మహీంద్రా టియువి300లో ఇది వరకే చాలా వేరియంట్లు ఉన్నాయి. అయితే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో టాప్ ఎండ్ వేరియంట్‌గా టి10 ను ప్రవేశపెట్టింది. ఇందులో అల్లాయ్ వీల్స్, రియర్ స్పాయిలర్, బ్లాక్ క్రోమ్ తొడుగులు గల ముందు వైపు ఫాగ్ ల్యాంప్స్ మరియు ఫ్రంట్ గ్రిల్ ఉన్నాయి.

మహీంద్రా టియువి300 టి10 విడుదల

మహీంద్రా టియువి300 టి10 వేరియంట్లు ధరలు

టియువి300 టి10 వేరియంట్లు ధరలు
టి10 మ్యాన్యువల్ రూ. 9.75 లక్షలు
టి10 ఆటోమేటిక్ రూ. 10.50 లక్షలు
టి10 మ్యాన్యువల్ (డ్యూయల్ టోన్) రూ. 9.90 లక్షలు
టి10 ఆటోమేటిక్ (డ్యూయల్ టోన్) రూ. 10.65 లక్షలు

అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

మహీంద్రా టియువి300 టి10 విడుదల

టియువి300 టి10 ఎక్ట్సీరియర్

మునుపటి వేరియంట్లతో పోల్చుకుంటే, మహీంద్రా టియువి300 టి10 వేరియంట్లో బ్లాక్ అవుట్ హెడ్ ల్యాంప్ క్లస్టర్, రూఫ్ రెయిల్స్, అల్లాయ్ వీల్స్, టెయిల్ గేట్ స్పేర్ వీల్ కవర్ వంటివి ఇప్పుడు మెటాలిక్ గ్రే ఫినిషింగ్‌లో ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
మహీంద్రా టియువి300 టి10 విడుదల

టియువి300 టి10 ఇంటీరియర్ ఫీచర్లు

ఇంటీరియర్‌లో టాప్ ఎండ్ వేరియంట్‌కు సూచకంగా, ఫాక్స్ లెథర్ అప్‌హోల్‌స్ట్రే మరియు డ్రైవర్, కో డ్రైవర్లకు లంబార్ సపోర్ట్ కలదు, హైట్ అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం ఉన్న డ్రైవర్ సీటు మరియు ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లను అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

మహీంద్రా టియువి300 టి10 విడుదల

టియువి300 టి10 ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు

ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మ్యాప్‌మై ఇండియా, ఆండ్రాయిడ్ ఆటో, న్యావిగేషన్ మరియు మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా డ్యాష్ బోర్డ్ మొత్తం పియానో బ్లాక్ ఫినిషింగ్‌లో ఉంది.

మహీంద్రా టియువి300 టి10 విడుదల

మహీంద్రా టియువి300 టి10 భద్రత ఫీచర్లు

మహీంద్రా టియువి300 టాప్ ఎండ్ వేరియంట్ టి10లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, చిన్న పిల్లల సీట్ల కోసం ఐఎస్ఒ ఫిక్స్ మౌంట్స్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా టియువి300 టి10 విడుదల

మహీంద్రా టియువి300 టి10 ఇంజన్ వివరాలు

మహీంద్రాలోని అన్ని టియువి300 వేరియంట్లు డీజల్ ఇంజన్‌లను కలిగి ఉన్నాయి. ఇందులోని 1.5-లీటర్ సామర్థ్యం గల ఎమ్‌హాక్100 డీజల్ ఇంజన్ గరిష్టంగా 100బిహెచ్‌పి పవర్ మరియు 240ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

మహీంద్రా టియువి300 టి10 విడుదల

టియువి300 టి10 లభించు కలర్ ఆప్షన్స్

మహీంద్రా టియువి300 టి10 ఆరు విభిన్న రంగుల్లో లభించును. అవి,

  • వెర్వ్ బ్లూ,
  • డైనమైట్ రెడ్,
  • మోల్టెన్ ఆరేంజ్,
  • గ్లేజీయర్ వైట్,
  • మాజెస్టిక్ సిల్వర్,
  • బోల్డ్ బ్లాక్, మరియు
  • బ్రాంజ్ గ్రీన్.
అదే విధంగా డ్యూయల్ పెయింట్ స్కీమ్‌లో లభించే వేరియంట్లను బ్లాక్/రెడ్ మరియు బ్లాక్/సిల్వర్ కాంబినేషన్‌లో ఎంచుగోలరు.
మహీంద్రా టియువి300 టి10 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా టియువి300 ఎస్‌యూవీ ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోని మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు కొత్తగా విడుదలైన టాటా నెక్సాన్ ల నుండి గట్టి పోటీని ఎదుర్కుంటోంది. మిగతా అన్ని ఎస్‌యూవీలు మార్కెట్ మరియు కస్టమర్ల ఎంపిక దృష్ట్యా డిజైన్ చేయబడ్డాయి. కానీ, మహీంద్రా మాత్రం టియువి300 వాహనాన్ని యుద్ద ట్యాంక్ శైలిలో భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ది

చేసింది. అయినప్పటికీ ఆశించిన సేల్స్ దక్కడం లేదు. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌ను అవకాశంగా మార్చుకుని వీలైనన్ని విక్రయాలు జరిపేందుకు టియువి300 ను టి10 వేరియంట్లో విడుదల చేసింది....

English summary
Read In Telugu: Mahindra TUV300 T10 Launched In India. Mahindra TUV300 T10 price, mileage, features, petrol & diesel variants.
Story first published: Friday, September 22, 2017, 18:57 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark