ప్రొడక్షన్‌కు సిద్దమైన మహీంద్రా ఎక్స్‌యూవీ ఏరో

Written By:

దేశీయ ఎస్‌యూవీల దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ఎక్స్‌యూవీ ఏరో వాహనాన్ని కాన్సెప్ట్ దశలో తొలిసారి ఆవిష్కరించింది. అయితే, దీనిని ప్రొడక్షన్‌కు సిద్దం చేసినట్లు సమాచారం.

మహీంద్రా ఎక్స్‌యూవీ ఏరో

ప్రముఖ ఆటోమొబైల్ సైట్ తెలిపిన కథనం మేరకు, 2018 నుండి ఎక్స్‌యూవీ ఏరో వాహనాన్ని ఉత్పత్తి చేయడానికి సముఖంగా ఉన్నట్లు తెలిసింది. దీనిని పూనేలోని కంపెనీ యొక్క చకన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ ఏరో

మహీంద్రా ఇంజనీర్ల బృందం ఎక్స్‌యూవీ ఏరో వెహికల్ ముందు భాగాన్ని అత్యంత అగ్రెసివ్ డిజైన్‌లో రూపొందించారు. చూడటానికి ఎక్స్‌యూవీ500 ను పోలి ఉన్నప్పటికీ ఏరోడైనమిక్ లక్షణాలతో రూపొందించడంతో ఏరో అనే పేరును పెట్టారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ ఏరో

ఎక్స్‌యూవీ ఏరో కూపే తరహా వాలుగా ఉన్న రూఫ్ టాప్ మరియు ఏరోడైనమిక్ డిజైన్ లక్షణాలను కలిగి ఉంది. రెండు డోర్లను కూడా ఓపెన్ చేస్తే ముందుకెళ్లడాన్ని చాలా కార్లలో గమనించి ఉంటాం. కానీ ఇందులో ముందు డోర్లు ముందు వైపుకు, వెనుక డోర్లను ఓపెన్ చేస్తే వెనుక వైపుకు విచ్చుకుంటాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ ఏరో

సాంకేతికంగా, ఎక్స్‌యూవీ ఏరో వెహికల్ ఎక్స్‌యూవీ 500 లోని 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ రానుంది. మహీంద్రా దీనిని రానున్న 2018 ఆటో ఎక్స్-పో వేదిక మీద మళ్లీ ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లోని దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు యుటిలిటి వాహన మార్కెట్ మీద దృష్టిపెట్టాయి. అయితే ఇదే సమయంలో యుటిలిటి వెహికల్ సెగ్మెంట్లో ముందంజలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా విభిన్న ఎస్‌యూవీ ఉత్పత్తులను అభివృద్ది చేస్తోంది. అందులో భాగంగానే ఎక్స్‌యూవీ ఏరో అభివృద్ది చేసినట్లు స్పష్టమవుతోంది.

English summary
Read In Telugu: Mahindra XUV Aero Production To Commence By 2018
Please Wait while comments are loading...

Latest Photos