ఎక్స్‌యూవీ500 పెట్రోల్ వెర్షన్ లాంచ్ చేసిన మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని పెట్రోల్ వెర్షన్‌లో లాంచే చేసింది. ఎక్స్‌యూవీ500 వాహనాన్ని పెట్రోల్ ఆప్షన్‌లో కోరుకునే కస్టమర్లను వదులుకోకుండా విడుదల చేసినట్లు తెలుస్తోంది.
దేశీయ దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని పెట్రోల్ వెర్షన్‌లో లాంచే చేసింది. ఎక్స్‌యూవీ500 వాహనాన్ని పెట్రోల్ ఆప్షన్‌లో కోరుకునే కస్టమర్లను వదులుకోకుండా విడుదల చేసినట్లు తెలుస్తోంది.
మహీంద్రా పెట్రోల్ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 15.49 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్ వెర్షన్‌కు G AT అనే వేరియంట్ పేరును ఖరారు చేసింది. 2.2-లీటర్ ఎమ్‌హాక్ పెట్రోల్ ఇంజన్‌ను జపాన్ ట్రాన్స్‌మిషన్ దిగ్గజం AISIN నుండి సేకరించిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
Recommended Video


6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గల 2.2-లీటర్ ఎమ్‌హాక్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 138బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జపాన్ నుండి దిగుమతి చేసుకున్న ట్రాన్స్‌మిషన్‌లో క్రీప్ మరియు మ్యాన్యువల్ అనే ఆప్షన్లు ఉన్నాయి.

పెట్రోల్ వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 చూడటానికి అచ్చం డీజల్ వెర్షన్‌నే పోలి ఉంటుంది. ఇందులో, 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే, పడల్ ల్యాంప్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మీద లోగో ప్రొజెక్షన్, స్టాటిక్ బెండింగ్ లైట్లు మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి కనెక్టివిటి ఫీచర్లు ఉన్నాయి.

అదనంగా, ఫుల్లీ ఆటోమేటిక్ టంపరేచర్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, లైట్ సెన్సింగ్ హెడ్ ల్యాంప్స్, ప్యాసివ్ కీ లెస్ ఎంట్రీ, 8-రకాలుగా అడ్జెస్టుకునే వెసులుబాటు ఉన్న డ్రైవర్ సీటు వంటివి ఎన్నో ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 పెట్రోల్ ఎస్‌యూవీలో భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం,యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఎమర్జెన్సీ కాల్ వంటి పలు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

దీని విడుదల సందర్భంగా మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సేల్స్ మరియు మార్కెటింగ్ హెడ్ విజయ్ రామ్ నక్రా మాట్లాడుతూ, "పెట్రోల్ ప్రీమియమ్ ఎస్‌యూవీల సెగ్మెంట్లో ఎక్స్‌యూవీ500 పెట్రోల్ వేరియంట్ ట్రెండ్ సెట్టర్ కానుంది. ధరకు తగ్గ విలువలతో ప్రత్యేక కస్టమర్లను ఇది సొంతం చేసుకోనుందని తెలపారు. రాజీలేని పనితీరు, హైటెక్నాలజీ జోడింపుతో ఉన్న ఫీచర్లు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు."

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మహీంద్రా తమ బెస్ట్ సెల్లింగ్ ప్రీమియమ్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 శ్రేణిలోకి పెట్రోల్ వేరియంట్‌ను చేర్చింది. దీంతో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. అయితే, ఎక్స్‌యూవీ500 పెట్రోల్ వేరియంట్లో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరో ఛాయిస్‌గా ఉంటే బాగుండేది.


Click it and Unblock the Notifications








