మహీంద్రా ఎక్స్‌యూవీ500లో W9 వేరియంట్ విడుదల: ధర రూ. 15.45 లక్షలు

మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌ను మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.

By Anil

మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌ను మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఎక్స్‌యూవీలోని టాప్ వేరియంట్ల మధ్య దూరాన్ని భర్తీ చేస్తూ, జీప్ కంపాస్‌ను ఎదుర్కునేందుకు డబ్ల్యూ9 (W9)వేరియంట్‌ను తీసుకొచ్చింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ9

మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ9 ధర రూ. 15.45 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. డబ్ల్యూ9 ఎక్ట్సీరియర్ చూడటానికి డబ్ల్యూ10 ను పోలి ఉంటుంది. అయితే, ఇంటీరియర్ పరంగా రెండు వేరియంట్ల మధ్య వ్యత్యాసం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ9

ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ9 వేరియంట్లో యాంటి పించ్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్, రివర్స్ కెమెరా, డైనమిక్ అసిస్ట్, 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, ఎమర్జెన్సీ కాల్స్ వంటివి వాటిని సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో డ్రైవింగ్ అలవాట్లను పర్యవేక్షించే ఎకోసెన్స్ పరిజ్ఞానం కలదు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ9

భద్రత పరంగా మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ9 లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హిల్ హోల్డ్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ9

అంతే కాకుండా ఇందులో, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, కార్నరింగ్ ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ మరియు స్టార్ట్ అండ్ స్టార్ట్ ఫుష్ బటన్ వంటిని ఉన్నాయి. అయితే, డబ్ల్యూ9 మరియు డబ్ల్యూ10 మధ్య తేడా ఏమిటని చూస్తే, డబ్ల్యూ9 లో కేవలం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఉంటే డబ్ల్యూ10లో మొత్తం ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఎయిర్ బ్యాగులు మినహాయిస్తే రెండు వేరియంట్లలో దాదాపు ఒకేలా ఉంటాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ9

సాంకేతికంగా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ9 వేరియంట్లో 2.2-లీటర్ సామర్థ్యం గల ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ కలదు. ఇది 3,750ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 140బిహెచ్‌పి పవర్ మరియు 1,600-2,800ఆర్‌పిఎమ్ మధ్య 330ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డబ్ల్యూ9 వేరియంట్ 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ9

జీప్ కంపాస్ లోని బేస్ డీజల్ వేరియంట్ ధర రూ. 15.81 లక్షలుగా ఉంది. ఇందులో 5-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 5-సీటింగ్ కెపాసిటి, హ్యాలోజియన్ హెడ్ ల్యాంప్స్, రెండు ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్, ఇబిడి, ఇఎస్‌సి మరియు నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. కంపాస్‌చో పోల్చితే ఎక్స్‌యూవీలో ఎక్కువ సీటింగ్ కెపాసిటి, పెద్ద పరిమాణంలో ఉన్న సన్ రూఫ్, మరియు అదనపు ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా15.45 లక్షల ధరతో లభిస్తున్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ9

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా తమ ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ9 వేరియంట్లో టాప్ ఎండ్ వేరియంట్ డబ్ల్యూ10 కు సమానమైన ఇంటీరియర్ ఫీచర్లను అందించింది. అయితే డబ్ల్యూ8 మరియు డబ్ల్యూ10 మధ్య వ్యత్యాసం ఉండటంతో విపణిలో ఉన్న కంపాస్ మరియు క్రెటా ఎస్‌యూవీలకు ఇంత కాలం కలిసొచ్చింది. దీనిని అంచనా వేసిన మహీంద్రా డబ్ల్యూ9 ను ప్రవేశపెట్టింది.

More from DriveSpark

Article Published On: Thursday, October 5, 2017, 10:28 [IST]
English summary
Read In Telugu: Mahindra XUV500 W9 Launched In India At Rs 15.45 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+