మరింత చౌకగా మారుతి ఆల్టో: తగ్గిన ధర వివరాలు

Written By:

మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో మీద ధర తగ్గించింది. భారత ప్రభుత్వం జూలై 1, 2017 అమల్లోకి తెచ్చిన నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టి కి అనుగుణంగా ఆల్టో మీద 3 శాతం వరకు ట్యాక్స్ తగ్గించింది. దీనికి అనుగుణంగా మారుతి ఆల్టో లోని అన్ని వేరియంట్ల మీద ధర తగ్గించింది.

తగ్గిన మారుతి సుజుకి ఆల్టో ధర,

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ కారు ఆల్టో లోని వివిధ వేరియంట్ల మీద రూ. 2,300 నుండి 5,400 వరకు ధర తగ్గించింది. గతంలో వ్యాట్ అమలయ్యేది, దీని స్థానంలోకి ఇప్పుడు ఏకీకృత ట్యాక్స్ జిఎస్‌టి వచ్చింది. నూతన ధరలు తగ్గింపు వివిధ రాష్ట్రాల వారీగా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

మరింత చౌకగా మారుతి ఆల్టో

మారుతి సుజుకి మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ కెనిచి అయుకవా మాట్లాడుతూ, భారత ప్రభుత్వం నూతన ట్యాక్స్ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం పట్ల అభినందనలు తెలిపాడు. జిఎస్‌టి అమలుతో దేశీయంగా వాహనా రంగాన్ని మరింత పటిష్టపరిచారని వెల్లడించాడు."

మరింత చౌకగా మారుతి ఆల్టో

అంతే కాకుండా, " దేశ ఆర్థిక వృద్ది మరియు అభివృద్ది కోసం అనేక సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకుని అనేక మంది నిపుణులు ఒక కొత్త ట్యాక్స్ విధానాన్ని రూపొందించడాన్ని భారత దేశం యొక్క నిబద్దతకు ఒక శక్తివంతమైన ఉదాహరణగా అభివర్ణించాడు.'

మరింత చౌకగా మారుతి ఆల్టో

సామాన్యులు ఎంచుకునే కారు ఇప్పుడు మరింత చౌకగా లభిస్తోంది. మారుతి ఆల్టో 800సీసీ మరియు 1,000సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల 800సీసీ ఆల్టో 47.3బిహెచ్‌పి పవర్ మరియు 69ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

మరింత చౌకగా మారుతి ఆల్టో

1,000సీసీ సామర్థ్యం గల ఆల్టో కె10 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. అయితే ఇందులో ఆటోగేర్‌షిప్ట్ ట్రాన్స్‌మిషన్(ఆటోమేటిక్ గేర్‌బాక్స్) అనుసంధానం కలదు.

మరింత చౌకగా మారుతి ఆల్టో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నూతన ట్యాక్స్ విధానంతో చిన్న కార్ల ధరలన్నీ తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఇటు కార్ల తయారీ సంస్థలకు మరియు కొనుగోలుదారులకు లాభదాయకంగా మారింది. భవిష్యత్తులో చిన్న కార్ల కొనుగోళ్లు విపరీతంగా పెరగనున్నాయని చెప్పవచ్చు.

English summary
Maruti Suzuki Alto Prices Drop Post GST Read In Telugu
Story first published: Monday, July 3, 2017, 18:51 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark