మారుతి సుజుకి బాలెనో ఆల్ఫా ఆటోమేటిక్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

Written By:

మారుతి సుజుకి బాలెనో లోని టాప్ ఎండ్ వేరియంట్‌ ఆల్ఫా ను ఆటోమేటిక్ వెర్షన్‌లో విపణిలోకి విడుదల చేసింది. గతంలో బాలెనో ఆల్ఫా కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే లభించేది. బాలోనో ఆల్ఫా ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 8.34 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు మారుతి ప్రతినిధులు వెల్లడించారు.

బాలెనో ఆల్ఫా ఆటోమేటిక్ వెర్షన్ విడుదల

మారుతి సుజుకి బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను తొలుత 2015లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. అప్పట్లో కేవలం బాలెనో డెల్టా వేరియంట్ మాత్రమే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించేది. తర్వాత 2016లో జెటా వేరియంట్లో ఆటోమేటిక్ వెర్షన్ వచ్చింది. అయితే టాప్ ఎండ్ వేరియంట్ వేరియంట్ ఆల్ఫా మాత్రం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో లభించేది.

Recommended Video - Watch Now!
Volkswagen Tiguan Review In Telugu - DriveSpark తెలుగు
బాలెనో ఆల్ఫా ఆటోమేటిక్ వెర్షన్ విడుదల

అయితే, నేడు(22 జూలై, 2017) మారుతి తమ బాలెనో లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫాను ఆటోమేటిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టింది. బాలెనో ఆల్ఫాను ఇప్పుడు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

బాలెనో ఆల్ఫా ఆటోమేటిక్ వెర్షన్ విడుదల

బాలెనో లోని ప్రారంభ వేరియంట్ సిగ్మా లో ఇప్పటికీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభించలేదు. సిగ్మా మినహాయించి అన్ని వేరియంట్లలో ఏఎమ్‌టి ఆప్షన్ లభిస్తోంది. బాలెనోలో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంర్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.

బాలెనో ఆల్ఫా ఆటోమేటిక్ వెర్షన్ విడుదల

పైన తెలిపిన ఫీచర్లతో పాటు బాలెనో ఆల్ఫా లో ఆపిల్ కార్ ప్లే మరియు మిర్రర్ లింక్ అప్లికేషన్లను సపోర్ట్ చేయగల స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్, లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, కీ లెస్ ఎంట్రీ మరియు అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతి బాలెనో ఆల్ఫా ఆటోమేటిక్ వెర్షన్ విడుదల

సాంకేతికంగా మారుతి బాలెనో ఆల్ఫా ఆటోమేటిక్ వేరియంట్లో 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. బాలెనో ఆల్ఫా ఏఎమ్‌టి లీటర్‌కు 21.4కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

బాలెనో ఆల్ఫా ఆటోమేటిక్ వెర్షన్ విడుదల

మారుతి సుజుకి బాలెనో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకు రెండు లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. 2016-17 సేల్స్‌లో ఆటోమేటిక్ వెర్షన్ బాలెనో కార్ల విక్రయాలు 11 శాతం నమోదయ్యాయి. 2020 నాటికి 3 లక్షల యూనిట్ల ఆటోమేటిక్ వెర్షన్ బాలెనో కార్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉంది.

బాలెనో ఆల్ఫా ఆటోమేటిక్ వెర్షన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్ల మార్కెట్ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో మారుతి ఆటోమేటిక్ కార్ల విక్రయాల మీద దృష్టిసారించింది. అందుకోసం బెస్ట్ సెల్లింగ్ బాలెనో లోని మూడు ప్రధాన వేరియంట్లను(డెల్టా, జెటా మరియు ఆల్ఫా) ఏఎమ్‌టి వెర్షన్‌లో అందుబాటులో ఉంచింది.

English summary
Read In Telugu: Maruti Baleno Alpha Automatic Launched India. Price, Mileag, Specifications and more

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark