టియాగోను ఎదుర్కొనేందుకు సెలెరియో క్రాస్ సిద్దం చేస్తున్నాం: మారుతి

మారుతి సుజుకి సెలెరియో క్రాస్‌ను పరీక్షిస్తుండంగా మీడియా కంట పడింది. అతి త్వరలో దీనిని విడుదల చేయనుంది.

By Anil

మారుతి సుజుకి తెర ముందు మంచి విక్రయాలు సాధిస్తూనే, తెర వెనుక మరిన్ని కొత్త మోడళ్లను మరియు లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను సిద్దం చేస్తోంది. పండుగ సీజన్ ముగిసేలోపు వీలైనన్ని ఎక్కువ కార్లను విక్రయించేందుకు మారుతి సన్నాహాలు ప్రారంభించింది.

తాజాగా, మారుతి సుజుకి సెలెరియో క్రాస్‌ను పరీక్షిస్తుండంగా ఓ మీడియా కంట పడింది.

మారుతి సుజుకి సెలెరియో క్రాస్

వెనుక బంపర్ మీద బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు వీల్ ఆర్చెస్ ఉన్న సెలెరియో రియర్ ఫోటోలు తాజాగా లీకయ్యాయి. ఈ సరికొత్త మోడల్‌ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద కాన్సెప్ట్ దశలో ప్రవేశపెట్టింది.

మారుతి సుజుకి సెలెరియో క్రాస్

మారుతి సెలెరియో క్రాస్ కారు ఆరేంజ్ కలర్ బాడీ పెయింట్ మరియు బ్లాక్ పెయింట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీనిని అడ్వర్టైజ్‌మెంట్ కోం చిత్రీకరిస్తునట్లు తెలిసింది. అయితే, సెలెరియో క్రాస్ గురించి మరే ఇతర వివరాలు తెలియరాలేదు.

మారుతి సుజుకి సెలెరియో క్రాస్

ప్రస్తుతం టాటా టియాగోతో మారుతి సుజుకి గట్టి పోటీని ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో సెలెరియోను రీఫ్రెష్ లుక్‌తో, సరికొత్త వేరియంట్లో విడుదల చేయడానికి మారుతి సిద్దమైంది. అందుకోసమే సెలెరియో క్రాస్ ను సిద్దం చేస్తున్నట్లు తెలిసింది.

మారుతి సుజుకి సెలెరియో క్రాస్

సెలెరియో క్రాస్ సాంకేతికంగా 1-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే అవకాశం ఉంది.

Recommended Video

Tata Tiago XTA AMT Variant Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మారుతి సుజుకి సెలెరియో క్రాస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి సెలెరియో క్రాస్ మరికొన్ని వారాల్లో పండుగ సీజన్‌ను పురస్కరించుకుని మార్కెట్లోకి విడుదల కానుంది. సెలెరియో క్రాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, టాటా టియాగోతో గట్టి పోటీనివ్వనుంది. కొత్త వేరియంట్లో విడుదలతో పోటీ మరింత తీవ్రం కానుంది. సెలెరియో మరియు టియాగో లలో ఏది బెస్ట్ ? కామెంట్ రూపంలో మాతో పంచుకోండి...

More from DriveSpark

Article Published On: Wednesday, September 27, 2017, 13:57 [IST]
English summary
Read In Telugu: Maruti celerio cross spotted india launch details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+