లిమిటెడ్ ఎడిషన్ మారుతి సెలెరియో విడుదలు: ఇవీ ఇందులోని ప్రత్యేకతలు!

Written By:

మారుతి సుజుకి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లో విపణిలోకి విడుదలయ్యింది. సాధారణ సెలెరియో లభించే విఎక్స్ఐ మరియు జడ్ఎక్స్ఐ వేరియంట్లలో మాత్రమే లిమిటెడ్ ఎడిషన్ సెలెరియో లభించనుంది. లిమిటెడ్ ఎడిషన్ సెలెరియో ప్రారంభ ధర రూ. 4.46 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

మారుతి సుజుకి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ విడుదల

ప్రస్తుతం ఉన్న సెలెరియోలోని విఎక్స్ఐ మరియు జడ్ఎక్స్ఐ వేరియంట్ల ధరల కన్నా ఈ లిమిటెడ్ ఎడిషన్ సెలెరియో విఎక్స్ఐ మరియు జడ్ఎక్స్ఐ వేరియంట్ల ధర రూ. 11,990 లు వరకు అధికంగా ఉంది. ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా ఎన్నో కాస్మొటిక్ మార్పులతో పాటు కొన్ని యాక్ససరీలను వీటిలో అందించింది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మారుతి సుజుకి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ విడుదల

సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌లో ప్రక్కవైపుల డోర్ల మీద సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో పాటు ఎక్ట్సీరియర్ మీద అనేక క్రోమ్ సొబగులను గుర్తించవచ్చు. డోర్ల మీద విండోల వద్ద, హెడ్ ల్యాంప్స్‌, టెయిల్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, డోర్ ప్యానల్స్ మరియు టెయిల్ గేట్‌ల మీద క్రోమ్ పట్టీలను అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ విడుదల

సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ విషయానికి వస్తే, సరికొత్త స్టీరింగ్ వీల్, కొత్త సీట్ కవర్లు, ఆంబియంట్ లైటింగ్, టిష్యూ బాక్స్ మరియు కప్ హోల్డర్లను అందివ్వడం జరిగింది. అంతే కాకుండా లిమిటెడ్ ఎడిషన్ సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

మారుతి సుజుకి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ విడుదల

సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా జరిగిన మార్పులను మినహాయిస్తే, సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. మునుపు లభించే అదే 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు.

మారుతి సుజుకి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ విడుదల

ఈ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు. ఏఆర్ఏఐ ప్రకారం దీని మైలేజ్ లీటర్‌కు 22.02కిలోమీటర్లుగా ఉంది.

మారుతి సుజుకి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ విడుదల

సెలెరియో లిమెటెడ్ ఎడిషన్‌ను సిఎన్‌జి ఇంజన్ వేరియంట్లో కూడా లభిస్తోంది. అయితే, దీనిని దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంచింది. సెలెరియో సిఎన్‌జి వేరియంట్ లీటర్‌కు 31.79కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. లిమిడెషన్ ఎడిషన్ సెలెరియో సిఎన్‌జి వేరియంట్ లభ్యత గురించి సమీపంలోని మారుతి డీలర్‌ను సంప్రదించగలరు. లిమిటెడ్ ఎడిషన్ సెలెరియో టాటా టియాగోకు గట్టి పోటీనివ్వనుంది.

మారుతి సుజుకి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి తమ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌లో అందించిన ప్యాకేజ్ విలువ 19,999 లుగా ఉంది. అయితే, ఈ ప్యాకేజ్‌ను కేవలం రూ. 11,999 లకే తమ సెలెరియోలో అందిస్తోంది. అంటే సుమారు రూ. 7,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో రియర్ పార్కింగ్ సెన్సార్లను కూడా అందివ్వడం జరిగింది.

English summary
Read In Telugu: Maruti Suzuki Celerio Limited Edition Launched In India; Prices Start At Rs 4.46 Lakh
Story first published: Saturday, August 5, 2017, 14:46 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark