మారుతి సియాజ్ హైబ్రిడ్ మీద రూ. 1.88 లక్షల వరకు పెరిగిన ధర

Written By:

జిఎస్‌టి అమలైన తరువాత, జిఎస్‌టిలోని స్లాబులకు అనుగుణంగా మారుతి సుజుకి తమ అన్ని కార్ల ధరలను సవరించడం జరిగింది. దాదాపు అన్ని మోడళ్ల మీద ధరలు తగ్గించిన మారుతి సియాజ్ లోని పెట్రోల్ వేరియంట్ మీద ధర తగ్గించగా, సియాజ్ లోని డీజల్ హైబ్రిడ్ వేరియంట్ల మీద భారీగా ధరలు పెంచింది.

మారుతి సియాజ్ హైబ్రిడ్ ధరలు

నూతన పన్ను విధానం జిఎస్‌టి అమలైన తరువాత ఇండియన్ మార్కెట్లో ఉన్న అన్ని కార్ల ధరల్లో స్వల్ప మార్పులు చేసుకున్నాయి. 28 శాతం నిర్దిష్ట ట్యాక్స్ మరియు అదనపు సెస్‌లతో వివిధ కెటిగిరీల వారీగా కార్ల మీద పూర్తి స్థాయి ట్యాక్స్ కేటాయించడం జరిగింది.

మారుతి సియాజ్ హైబ్రిడ్ ధరలు

భారత దేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ అన్ని ఉత్పత్తుల మీద 3 శాతం మేరకు ధరలను తగ్గించింది. దీంతో సియాజ్ సెడాన్ లోని బేస్ పెట్రోల్ వేరియంట్ మీద రూ. 7,000 లు మరియు టాప్ ఎండ్ పెట్రోల్ వేరియంట్ మీద రూ. 9,000 ల వరకు తగ్గించబడింది. ఇప్పటి వరకు మారుతి తగ్గించిన ధరలలో ఇదే ఎక్కువ.

మారుతి సియాజ్ హైబ్రిడ్ ధరలు

హైబ్రిడ్ కార్ల మీద గతంలో ఉన్న ట్యాక్స్‌తో పోల్చుకుంటే ఇప్పుడు భారీగా పెరిగింది. ప్రస్తుతం హైబ్రిడ్ కార్ల మీద 43 శాతం ట్యాక్స్ అమల్లో ఉంది. మారుతి సుజుకి సియాజ్‌లో స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి (SHVS) అనే హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని సియాజ్ లోని డీజల్ వేరియంట్లో అందించింది. కాబట్టి ఈ వేరియంట్లు హైబ్రిడ్ కెటగిరీలోకి రావడంతో వీటి ధరలు భారీగా పెరిగాయి.

మారుతి సియాజ్ హైబ్రిడ్ ధరలు

డీజల్ వెర్షన్ సియాజ్ హైబ్రిడ్ యొక్క ప్రారంభ వేరియంట్ మీద రూ. 1.56 లక్షల నుండి టాప్ ఎండ్ వేరియంట్ మీద రూ. 1.88 లక్షలు వరకు పెంచడం జరిగింది. వివిధ వేరియంట్ల ఆధారంగా మరియు నగరాల మధ్య పెంపులో స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది(పెరిగిన ధరలు ఢిల్లీ ఆధారంగా ఇవ్వబడ్డాయి).

మారుతి సియాజ్ హైబ్రిడ్ ధరలు

గతంలో సియాజ్ డీజల్ హైబ్రిడ్ వెర్షన్‌ను మైలేజ్ దృష్ట్యా ఎక్కువ మంది ఎంచుకునే వారు. కానీ పెట్రోల్ సియాజ్ ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు సియాజ్ హైబ్రిడ్ ధరలు భారీగా పెరిగాయి(సుమారుగా రూ. 2 లక్షల వరకు). రెండింటి మధ్య ధర వ్యత్యాసం అధికంగా ఉండటంతో ఇప్పుడు డీజల్ వెర్షన్ బదులుగా పెట్రోల్ వెర్షన్ సియాజ్ ఎంచుకోవడం ఉత్తమం.

మారుతి సియాజ్ హైబ్రిడ్ ధరలు

మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ వేరియంట్లో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ 91బిహెచ్‌పి పవర్ మరియు 130ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

మారుతి సియాజ్ హైబ్రిడ్ ధరలు

డీజల్ వెర్షన్ హైబ్రిడ్ మారుతి సుజుకి సియాజ్‌లో ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో ఉన్న 1.3-లీటర్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 88.5బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల దీనిని కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో మాత్రమే ఎంచుకోవచ్చు.

మారుతి సియాజ్ హైబ్రిడ్ ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి తమ పాపులర్ సెల్లింగ్ మోడల్స్ అయిన స్విఫ్ట్ మరియు ఆల్టో మీద ధరల సవరించి తగ్గింపు చేపట్టింది. సియాజ్ సెడాన్ ఎంపిక చేసుకోవాలనుకునే వారు పెట్రోల్ వేరియంట్ మరియు హైబ్రిడ్ వేరియంట్ సియాజ్ ధరలను గమనించిన తరువాత ఎంచుకోవడం ఎంతో ఉత్తమం. మారుతి కార్ల ధరలు మరియు డీలర్ల వివరాల కోసం...

English summary
GST: Maruti Ciaz Petrol Now More Affordable Read In Telugu
Story first published: Wednesday, July 5, 2017, 8:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark