మారుతికి విశ్వరూపం చూపిస్తున్న డిజైర్ బుకింగ్స్

Written By:

భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించి ఎలాగోలా తమ కార్లను అమ్మేయాలనుకుంటాయి కార్ల కంపెనీలు. అన్ని కంపెనీల విషయంలో దాదాపు ఇదే జరుగుతుంది. కానీ మారుతి సుజుకి విషయంలో అది అక్షరాలా తప్పు.

మారుతి కార్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్రతి కారు మీద కొన్ని నెలలపాటు వెయిటింగ్ పీరియడ్ ప్రకటిస్తోంది మారుతి. డిజైర్ విషయానికి వస్తే, డిమాండ్‌కు తగినట్లుగా ఉత్పత్తి చేయడంలో మారుతి తలమునకలు అవుతోంది.

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి తమ నెక్ట్స్ జనరేషన్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును మే 16, 2017 న విడుదల చేసింది. సరిగ్గా విడుదల నాటికే దీని మీద 33,000 బుకింగ్స్ నమోదయ్యాయి, అయితే ఇప్పుడు ఆ బుకింగ్స్ సంఖ్య ఏకంగా 50,000 దాటిపోయింది.

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, డిమాండ్ తగ్గ ఉత్పత్తి చేయడంలో మారుతి విఫలం చెందుతోంది, అందుకుగాను బుకింగ్ చేసుకున్న వారికి డెలివరీ ఇవ్వడానికి భారీ వెయింట్ పీరియడ్ ఇస్తోంది. ప్రస్తుతం మూడు నెలల వెయింటింగ్ పీరియడ్ ఉంది.

గతంలో మారుతి విక్రయించిన 16,968 యూనిట్ల డిజైర్ కార్లతో పోల్చుకుంటే మే 2017 లో కేవలం 9,073 యూనిట్ల డిజైర్ కార్లను విక్రయించింది. ఇందుకు కారణం మారుతికి చెందిన మరో ప్రొడక్షన్ ప్లాంటులో తయారీ యూనిట్ బదిలీచేయడం ద్వారా ఉత్పత్తి ఆలస్యం అయ్యింది.

బాలెనో కారును అభివృద్ది చేసిన హార్ట్‌టెక్(HEARTECT) ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా మారుతి తమ సరికొత్త డిజైర్‌ను రూపొందించింది.

2017 మారుతి డిజైర్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ వేరియంట్లలో లభించును.

సరికొత్త డిజైర్‌లోని అన్ని వేరియంట్లను 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు‌ అభిప్రాయం!

ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లోని ప్రతి సెగ్మెంట్లలో ఉన్న బెస్ట్ సెల్లింగ్ కారు మారుతి నుండే ఉండటం గమనార్హం. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో పోటీదారులకు సాధ్యం కాని ధర మరియు ఫీచర్లను డిజైర్‌లో అందివ్వడంతో మంచి విజయాన్ని అందుకుంది మారుతి.

English summary
Read In Telugu New Maruti Dzire Bookings And Waiting Period Goes Up
Story first published: Thursday, June 22, 2017, 16:58 [IST]
Please Wait while comments are loading...

Latest Photos