జిఎస్‌టి అనంతరం మారుతి డిజైర్ ధరల్లో మార్పులు

Written By:

మారుతి సుజుకి నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టికి అనుగుణంగా తమ సరికొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైర్ మీద ధరల సవరణ చేపట్టింది. నూతన ధరల ప్రకారం, డిజైర్ మీద గరిష్టంగా రూ. 4,000 వరకు ధర తగ్గించడం జరిగింది.

జిఎస్‌టి అనంతరం మారుతి డిజైర్ ధరలు

కొత్త పన్ను విధానం ప్రకారం, మారుతి డిజైర్ పెట్రోల్ మీద 28 శాతం మరియు 1 శాతం సెస్, అదే విధంగా మారుతి డిజైర్ డీజల్ వేరియంట్ మీద 28 శాతం నిర్ధిష్ట ట్యాక్స్ మరియు 3 శాతం సెస్ అమలు చేసింది.

జిఎస్‌టి అనంతరం మారుతి డిజైర్ ధరలు

నాలుగు మీటర్ల పొడవు లోపు 1.2-లీటర్ కన్నా తక్కువ కెపాసిటి ఉన్న పెట్రోల్ మరియు 1.5-లీటర్ కన్నా తక్కువ కెపాసిటి ఉన్న డీజల్ ఇంజన్‌ల వంటి కెటగిరీల ప్రకారం అదనపు సెస్ నిర్ణయించడం జరిగింది.

జిఎస్‌టి అనంతరం మారుతి డిజైర్ ధరలు

జిఎస్‌టికి ముందు మారుతి డిజైర్ ధరల శ్రేణి రూ. 5.45 లక్షల నుండి 9.41 లక్షల మధ్య ఉండగా జిఎస్‌టి అమలుతో గరిష్టంగా రూ. 4,000 ల వరకు తగ్గడంతో జిఎస్‌టి అనంతరం మారుతి డిజైర్ ధరల శ్రేణి రూ. 5.42 లక్షల నుండి 9.39 ల మధ్య ఉంది(ఢిల్లీ నగరం ఆధారంగా ధరలు ఇవ్వబడ్డాయి).

జిఎస్‌టి అనంతరం మారుతి డిజైర్ ధరలు

డిజైన్ మరియు ఫీచర్ల అప్‌గ్రేడ్స్‌తో ఈ ఏడాది మార్కెట్లోకి విడుదలైన మారుతి డిజైర్‌లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లు కలవు. రెండింటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో ఎంచుకోవచ్చు.

English summary
Read In Telugu: Maruti Dzire Prices Decrease After GST
Story first published: Wednesday, July 5, 2017, 17:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark