మారుతి ఆల్టో 800 ఉత్సవ్ ఎడిషన్ విడుదల

మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో 800 కారును ఉత్సవ్ ఎడిషన్‌లో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కెట్లోకి విడుదల చేసింది.

By Anil

మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో 800 కారును ఉత్సవ్ ఎడిషన్‌లో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 3.54 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఢిల్లీగా ఉన్నాయి.

మారుతి ఆల్టో 800 ఉత్సవ్ ఎడిషన్

ఆల్టో 800 లోని ఎల్ఎక్స్ఐ మరియు విఎక్స్ఐ వేరియంట్ల ఆధారంగా ఉత్సవ్ ఎడిషన్‌లో హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేసింది. ఆల్టో ఉత్సవ్ ఎడిషన్‌లో సరికొత్త బాడీ గ్రాఫిక్స్, సైడ్ ప్రొఫైల్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ కవర్ గార్నిష్, డీరో సీల్ గార్డ్ మరియు ఇతర యాక్ససరీలను అందించారు.

మారుతి ఆల్టో 800 ఉత్సవ్ ఎడిషన్

ఆల్టో 800 ఇంటీరియర్‌లో ఉత్సవ్ ఎడిషన్ సీట్ కవర్లు ఉన్నాయి. లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ఆల్టో కారులో భద్రత పరంగా అదనంగా రివర్స్ పార్కింగ్ సెన్సార్లను అందించింది. రూ. 3.54 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో ఎంచుకోవచ్చు.

మారుతి ఆల్టో 800 ఉత్సవ్ ఎడిషన్

సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఆల్టో 800 ఉత్సవ్ ఎడిషన్‌లో 796సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 47.3బిహెచ్‌పి పవర్ మరియు 69ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మారుతి ఆల్టో 800 ఉత్సవ్ ఎడిషన్

విఎక్స్ఐ ఆల్టో 800 వేరియంట్ మీద రిమోట్ కీలెస్ ఎంట్రీ, రియర్ డోర్ చైల్డ్ లాక్ మరియు సెంట్రల్ డోర్ లాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగుని ఆప్షనల్‌గా అందించారు. స్టాండర్డ్ వేరియంట్ కన్నా ఆల్టో800 ఉత్సవ్ ఎడిషన్ ధర రూ. 20,000 లు మాత్రమే అధికం.

మారుతి ఆల్టో 800 ఉత్సవ్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి ఆల్టో 800 కారును పండుగ సీజన్ నేపథ్యంలో ఉత్సవ్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో ఉన్న క్విడ్, ఇయాన్ మరియు డాట్సన్ రెడి గో కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 30, 2017, 17:24 [IST]
English summary
Read In Telugu: Maruti Suzuki Alto 800 Utsav Edition Launched In India; Priced At Rs 3.54 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+