రెగ్యులర్ షోరూమ్‌లను అరెనా పేరుతో మార్చేసిన మారుతి సుజుకి

Written By:

భారత దేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నెక్సా కాకుండా మిగిలిన అన్ని విక్రయ కేంద్రాల పేరును "మారుతి సుజుకి అరెనా" గా మార్చేసింది. దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్న తమ విక్రయ కేంద్రాల బ్రాండ్ పేరును మారుతి సుజుకి అరెనా(Maruti Suzuki Arena)గా మార్చినట్లు ప్రకటించింది.

మారుతి సుజుకి అరెనా షోరూమ్

నూతన మారుతి సుజుకి అరెనా షోరూమ్‌లను ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతోంది. అంతేకాకుండా షోరూమ్‌లలో కస్టమర్ల పట్ల స్నేహపూర్వకమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించనుంది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
మారుతి సుజుకి అరెనా షోరూమ్

మారుతి సుజుకి అరెనా ప్రారంభంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా నాలుగు విభిన్నమైన విక్రయ కేంద్రాలు ఉన్నాయి. అవి, మారుతి సుజుకి అరెనా, నెక్సా, కమర్షియల్ మరియు ట్రూ వ్యాల్యూ. సరికొత్త షోరూమ్‌లు కస్టమర్లకు అత్యుత్తమ అనుభవాన్ని కల్పిస్తాయని మారుతి పేర్కొంది.

మారుతి సుజుకి అరెనా షోరూమ్

ఇతర మారుతి విక్రయ కేంద్రాలతో పోల్చుకుంటే విభిన్నంగా ఉండేందుకు మారుతి సుజుకి అరెనా షోరూమ్‌ మొత్తాన్ని డిజిటల్ మయం చేసింది. ఆన్‌లైన్ ద్వారా కస్టమర్ల తమకు నచ్చిన మోడళ్లను ఎంపిక చేసుకోవడం మరియు తమ అభిరుచికి తగ్గట్లుగా ఎక్ట్సీరియర్ పెయింట్ మోడిఫికేషన్‌లో మారుతి ఉత్పత్తులను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

మారుతి సుజుకి అరెనా షోరూమ్

మారుతి సుజుకి అరెనా అన్ని షోరూమ్‌లను కూడా కస్టమర్లను ప్రత్యేకంగా చూసుకోవడానికే పెద్ద పీట వేస్తూ డిజైన్ చేసి, సదుపాయాలను అందిస్తోంది. కస్టమర్ల కోసం కాఫీ లాంజ్, కస్టమర్లు గర్వంగా ఫీల్ అయ్యేలా మంచి అనుభవాన్ని పొందవచ్చు.

మారుతి సుజుకి అరెనా షోరూమ్

మారుతి సుజుకి సంస్థ యొక్క ట్రాన్స్‌ఫార్మేషన్ 2.0 ప్రణాళికలో భాగంగా ప్రారంభించినట్లు మారుతి పేర్కొంది. డిజైన్, టెక్నాలజీ మరియు ఎక్స్పీరియన్స్ అనే మూడు అంశాల ఆధారంగా విక్రయ కేంద్రాలను నిర్మిస్తున్నట్లు పేర్కొంది.

మారుతి సుజుకి అరెనా షోరూమ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి అరెనా షోరూమ్‌లు ఆధునికత మరియు సౌకర్యవంతమైన అనుభవాన్ని కస్టమర్లకు అందించే లక్ష్యంతో డిజైన్ చేయబడ్డాయి. 2018 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 80 మారుతి సుజుకి అరెనా విక్రయ కేంద్రాలను ప్రారంభించాలని భావిస్తోంది.

English summary
Read In Telugu: Maruti Suzuki To Transform Its Sales Channel Through “Maruti Suzuki Arena”
Story first published: Thursday, August 31, 2017, 17:44 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark