అరుదైన సేల్స్ మైలురాయిని దాటిన మారుతి సుజుకి బాలెనో

Written By:

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వారి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో విపణిలోకి విడుదలైనప్పటి నుండి 2,00,000 యూనిట్ల సేల్స్ మైలురాయిని ఛేదించింది.

ఆటోమొబైల్ న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం, విడుదలైన కేవలం 20 నెలల కాలంలోనే రెండు లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని మారుతి బాలెనో అధిగమించినట్లు తెలిసింది. అయితే మారుతి సుజుకి దీని విక్రయాలకు సంభందించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అక్టోబర్ 26, 2015లో విడుదలైన బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సంవత్సరంలోపే లక్షకు పైగా విక్రయాలు సాధించింది. మే 2017 వరకు 1,97,660 యూనిట్ల బాలెనో కార్లు అమ్ముడయ్యాయి.

ప్రతి మాసం సగటు విక్రయాలు 16,000 యూనిట్లుగా ఉన్నాయి. కాబట్టి ఆ లెక్కన చూస్తే, విడుదలైనప్పటి నుండి బాలెనో రెండు లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయిందని చెప్పవచ్చు.

స్థిరమైన విక్రయాలు సాధిస్తూ, ప్రతి మాసంలో భారతదేశపు టాప్-10 బెస్ట్ కార్ల జాబితాలో బాలెనో స్థానం సంపాదించుకుంటూ వస్తోంది. నెక్సా యొక్క మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్ బాలెనో కారే, దీనికి ముందు ఎస్-క్రాస్ నెక్సా ద్వారా విడుదలైనప్పటికీ ఆశించిన మేర ఫలితాలు లభించలేదు.

మార్చి 2017 న మారుతి సుజుకి తమ బాలెనో హ్యాచ్‌బ్యాక్‌ను మరింత శక్తివంతమైన వెర్షన్‌లో ఆర్ఎస్ బ్యాడ్జి పేరుతో విడుదలైంది. బాలెనో మరియు బాలెనో ఆర్ఎస్ లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్‌ ప్లాంటులోని బాలెనో ఉత్పత్తిని రెట్టింపు చేసారు.

మారుతి బాలెనో రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అవి, 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్. ఇక బాలెనో ఆర్ఎస్ వెర్షన్‌లో 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ల ట్రెండ్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలెనోతో పాటు అనేక కార్లు విడుదలయ్యాయి. కానీ బాలెనో సెగ్మెంట్ లీడర్‌గా నిలిచింది. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను తిరగరాస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

English summary
Read In Telugu Maruti Suzuki Baleno Achieves 2 Lakh Sales Milestone India
Please Wait while comments are loading...

Latest Photos