సెలెరియో ఫేస్‌లిఫ్ట్‌ను సిద్దం చేస్తున్న మారుతి సుజుకి

Written By:

స్మాల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో అత్యుత్తమ అమ్మకాలు సాధిస్తున్న మారుతి సుజుకి మోడల్ సెలెరియో. 2014 లో విడుదలైన సెలెరియో ఇండియన్ మార్కెట్లో మంచి విజయాన్ని అందుకుంది. భారతీయులకు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రుచి చూపించిన ఈ సెలెరియో కారును ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేడానికి సిద్దం చేసింది.

మారుతి సుజుకి సెలెరియో ఫేస్‌లిఫ్ట్

ఓ ఆన్ లైన్ వార్తా వేదిక తెలిపిన కథనం మేరకు మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో వచ్చే పండుగ సీజన్ నాటికి విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగా అనేక మార్పులు సంతరించుకుంటున్నట్లు సమాచారం.

మారుతి సుజుకి సెలెరియో ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి 2013 లో ప్రదర్శించి ఏ-విండ్ కాన్సెప్ట్ తరహా డిజైన్ శైలిలో రానుంది. ఫ్రంట్ డిజైన్‌లో ఆంగ్లపు ఎల్-ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే లైట్లు, రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, బంపర్ మరియు క్రోమ్ లోహపు తొడుగుల మధ్యలో ఫాగ్ ల్యాంప్ అమరిక వంటివి రానున్నాయి.

మారుతి సుజుకి సెలెరియో ఫేస్‌లిఫ్ట్

సైడ్ డిజైన్ విషయానికి వస్తే, క్రాసోవర్ ఫీల్ కోసం సైడ్ డోర్ల మీద బ్లాక్ స్ట్రిప్స్ రానున్నాయి. టర్న్ ఇండికేటర్స్ ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, అదే విధంగా సెలెరియో లోని టాప్ రేంజ్ వేరియంట్లలో బ్లాక్ ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్ కలదు.

మారుతి సుజుకి సెలెరియో ఫేస్‌లిఫ్ట్

స్పోర్టివ్ ఫీల్ అందించేందుకు సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్‌లో రూఫ్ స్పాయిలర్‌ను అందివ్వనుంది. నూతనంగా డిజైన్ చేయబడిన టెయిల్ లైట్ క్లస్టర్, రీ డిజైన్డ్ బంపర్ లతో ప్రస్తుతం తరాన్ని ఆకట్టుకునేందుకు భారీ మార్పులతో అగ్రెవ్‌సివ్‌ డిజైన్ శైలిలో రానుంది.

మారుతి సుజుకి సెలెరియో ఫేస్‌లిఫ్ట్

ఎక్ట్సీరియర్‌తో పాటుగానే ఇంటీరియర్‌లో కూడా అనేక మార్పులు సంభవించనున్నాయి. ప్రస్తుతం అన్ని కార్లలో ట్రెడింగ్‌గా వస్తున్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఫేస్‌లిఫ్ట్ సెలెరియో రానుంది. దీనికి తోడుగా ప్రీమియమ్ ఫీల్ కల్పించేందుకు పియానో బ్లాక్ కలర్‌లో అప్‌హోల్‌స్ట్రే రానుంది.

మారుతి సుజుకి సెలెరియో ఫేస్‌లిఫ్ట్

సాంకేతికంగా సెలెరియో హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 67బిహెచ్‍‌‌పి మరియు 90ఎన్ఎమ్ అదే విధంగా సిఎన్‌జి వేరియంట్ 59బిహెచ్‌పి పవర్ మరియు 78ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి సెలెరియో ఫేస్‌లిఫ్ట్

ఎక్ట్సీరియర్ మీద డిజైన్ మార్పులతో, ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లను అందిస్తూ, ప్రీమియమ్ ఇంటీరియర్ డిజైన్‌తో రానున్న సెలెరియో ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం సెలెరియోలో అందుబాటులో ఉన్న అవే ఇంజన్ ఆప్షన్‌లతో రానుంది.

మారుతి సుజుకి సెలెరియో ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి ఈ ఫేస్‌లిఫ్ట్ సెలెరియోను పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదల చేస్తే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెనో క్విడ్,టాటా టియాగో, నిస్సాన్ మైక్రా, హోండా బ్రియో మరియు రెనో పల్స్ వంటి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu Maruti Suzuki Celerio Facelift India Launch Details Revealed
Story first published: Friday, May 26, 2017, 15:56 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark