సియాజ్ హైబ్రిడ్ విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదంటున్న మారుతి

Written By:

కేంద్ర ప్రభుత్వం నూతన ట్యాక్స్ విధానం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST)ని అమల్లోకి తెచ్చిన తర్వాత దేశీయ వాహన పరిశ్రమలో ఊహించని పరిణాలు చోటు చేసుకుంటూ వచ్చాయి.

కాలుష్యాన్ని అధికంగా విడుదల చేసే పెట్రోల్ మరియు డీజల్ కార్ల ధరలు తగ్గుముఖం పట్టగా, పర్యావరణానికి మేలు కలిగించే ఎకో ఫ్రెండ్లీ కార్ల మీద ట్యాక్స్ విపరీతంగా పెరగడంతో హైబ్రిడ్ కార్ల ధరలు భారీగా పెరిగాయి.

మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ కార్లు

హైబ్రిడ్ కార్ల ధరలు పెరిగిన నేపథ్యంలో తక్కువ పొగను వెదజల్లి, ఎక్కువ మైలేజ్‌నిచ్చే పర్యావరణ హితమైన కార్లను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. జిఎస్‌టి కారణంగా హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ పెరగడంతో కొన్ని కార్ల తయారీ సంస్థలు తమ హైబ్రిడ్ కార్లను మార్కెట్ నుండి తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి.

మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ కార్లు

అయితే మారుతి సుజుకి ఈ విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తెలిపింది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులో ఉన్న తమ కార్ల మీద నూతన ట్యాక్స్ విధానం ప్రకారం ధరలు పెరిగినప్పటికీ వాటిని మార్కెట్ నుండి తొలగించకుండా, యథావిధిగా విక్రయిస్తామని ప్రకటించింది.

మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ కార్లు

ప్రస్తుతం మారుతి సుజుకి లైనప్‌లో సియాజ్ మరియు ఎర్టిగా ఎమ్‌పీవీలు మైల్డ్ హైబ్రిడ్ పరిజ్ఞానంతో లభిస్తున్నాయి. జిఎస్‌టి అమలైన కారణంగా, వీటి ధరలు సుమారుగా రూ. 1 లక్ష వరకు పెరిగాయి. జిఎస్‌టి లోని లగ్జరీ స్లాబులకు వర్తించే ట్యాక్స్‌ను ఎకో ఫ్రెండ్లీ కార్లకు కూడా అమలు చేయడమే ఇందుకు కారణం.

మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ కార్లు

ప్రస్తుతం ఫ్రెండ్లీ కార్ల మీద 28 శాతం నిర్ధిష్ట ట్యాక్స్ మరియు 15 శాతం అదనపు సెస్ కలుపుకొని మొత్తం 43 శాతంగా ట్యాక్స్ నిర్ణయించారు. అయితే గతంలో హైబ్రిడ్ వెహికల్స్ మీద అన్ని పన్నులతో సహా గరిష్టంగా 30.3 శాతం ట్యాక్స్ మాత్రమే అమలయ్యేది. సుమారుగా 12.7 శాతం ట్యాక్స్ పెరగడంతో ఈ మేరకు హైబ్రిడ్ కార్ల ధరలు పెంపు బాట పట్టాయి.

మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ కార్లు

మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి అయుకవా మాట్లాడుతూ, "తమ వద్ద లభించే అన్ని కార్లలో హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని అందివ్వాలని నిర్ణయించుకున్నప్పుడు, ఒక లక్ష్యంతో పర్యావరణహితమైన ఎకో ఫ్రెండ్లీ కార్లను అభివృద్ది చేయడం జరిగింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తమ అన్ని కార్లలో కూడా హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని అందించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు."

మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ కార్లు

ఇండియాలో జిఎస్‍‌టి కారణంగా హైబ్రిడ్ కార్ల ధరలు పెరిగితే, హైబ్రిడ్ కార్ల అభివృద్ది, తయారీ మరియు విక్రయాల పరంగా వెనక్కి తగ్గేది లేదని మారుతి సుజుకి పరోక్షంగా స్పష్టం చేస్తోంది.

మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ కార్లు

అయితే, భారత ప్రభుత్వం హైబ్రిడ్ కార్ల ట్యాక్స్ గురించి పునరాలోచన చేసి, ట్యాక్స్ తగ్గిస్తే బాగుంటుందని మారుతి భావిస్తోంది. నిజానికి కాలుష్య కారకాలైన కార్ల మీద ట్యాక్స్ తగ్గించడం, తక్కువ కాలుష్య కారకాలైన హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ పెంచడం ఎంతవరకు సరైనదో కేంద్రానికే తెలియాలి మరి!

English summary
Read In Telugu: Maruti Suzuki To Sell Hybrid Vehicles Despite GST Tax Rates
Story first published: Wednesday, July 12, 2017, 16:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark