అలర్ట్: పెద్ద ఎత్తున రీకాల్‌కు గురైన మారుతి డిజైర్ కార్లు

మారుతి సుజుకి కొత్తగా విడుదల చేసిన డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లను పెద్ద సంఖ్యలో రీకాల్ చేసింది. సాంకేతిక లోపం కారణంగా మారుతి దేశవ్యాప్తంగా విక్రయించిన కార్లలో కొన్నింటిని వెనక్కి పిలిచింది.

By Anil

ప్యాసింజర్ కార్లకు సంభందించిన వార్తల్లో మారుతి సుజుకి సంస్థకు సంభందించిన వార్తలకు భలే క్రేజ్. ఇందుకు ప్రదాన కారణంగా భారతదేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ, దేశవ్యాప్తంగా అత్యధిక విక్రయ మరియు సర్వీసింగ్ కేంద్రాలు కలిగి ఉన్న సంస్థ మరియు ధరకు తగ్గ విలువ గల కార్లను తయారు చేసే సంస్థగా గుర్తింపు పొందడం. మరి మారుతి గురించి ఇవాళ్టి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకోసం...

మారుతి డిజైర్ రీకాల్

దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొత్తగా విడుదల చేసిన డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లను పెద్ద సంఖ్యలో రీకాల్ చేసింది. సాంకేతిక లోపం కారణంగా మారుతి దేశవ్యాప్తంగా విక్రయించిన కార్లలో కొన్నింటిని వెనక్కి పిలిచినట్లు అధికారికంగా స్పష్టం చేసింది.

మారుతి డిజైర్ రీకాల్

కొత్త డిజైర్ కార్లలోని రియర్ వీల్ హబ్ వద్ద లోపం కారణంగా ఫిబ్రవరి 23, 2017 నుండి జూలై 10, 2017 మధ్య విక్రయించిన వాటిలో 21,494 యూనిట్లను మారుతి సుజుకి వెనక్కి పిలిచింది. రీకాల్ చేసిన కార్లలో మాత్రమే ఈ లోపాన్ని గుర్తించినట్లు మారుతి తెలిపింది.

మారుతి డిజైర్ రీకాల్

ఓ దిగ్గజ ఆన్‌లైన్ వార్తా పత్రిక తెలిపిన కథనం మేరకు, మారుతి విక్రయించిన డిజైర్ కార్లలో రియర్ వీల్ హబ్ వద్ద సమస్య కారణంగా వెనక్కి పిలిచిన విషయాన్ని తమ అధికారిక వెబ్‌సైట్లో పేర్కొన్నట్లు మరియు రీకాల్‌కు గురైన కార్లను అక్టోబర్ 3, 2017 నుండి సమీప డీలర్ల వద్ద కార్లను చెక్ చేయించుకోవాలని డీలర్లకు సూచించినట్లు పేర్కొంది.

మారుతి డిజైర్ రీకాల్

మీరు కనుక కొత్త మారుతి డిజైర్ కారును కొన్నట్లయితే, మీకు సమీపంలోని మారుతి సుజుకి విక్రయ కేంద్రాన్ని లేదా మారుతి సర్వీసింగ్ సెంటర్‌ను సంప్రదించి మారుతి తెలిపిన లోపాన్ని సవరించుకోండి. రీకాల్ జాబితాలో తమ డిజైర్ కారు ఉందో.. లేదో... తెలుసుకోవాలంటే మీ కారు యొక్క 14 అంకెల వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆధారంగా ఈ వెబ్‌సైట్లో చెక్ చేసుకోగలరు.

మారుతి డిజైర్ రీకాల్

న్యూ డిజైర్ మారుతి సుజుకి సంస్థకు మంచి విజయాన్ని సాధించిపెట్టింది. ఇప్పుడు బెస్ట్ సెల్లింగ్ కారుగా మొదటి స్థానంలో నిలిచింది. విడుదలైనప్పటి నుండి కేవలం ఐదు నెలల కాలంలోనే డిజైర్ కార్లను మారుతి విక్రయించింది. పేరు అదే అయినప్పటికీ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పూర్తిగా మారిపోయాయి.

మారుతి డిజైర్ రీకాల్

ప్రస్తుతం మారుతి సుజుకి డిజైర్ మీద మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. నూతన డిజైన్, ఫ్రెష్ లుక్, అద్భుతమైన మైలేజ్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫీచర్లు ఇందులో ప్రత్యేకంగా నిలిచాయి.

మారుతి డిజైర్ రీకాల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి చేసిన తొలి డిజైర్ రీకాల్ ఇదే. గతంలో, పాత మోడల్ డిజైర్ కారును స్టీరింగ్ అమరికలో లోపం కారణంగా ఓసారి రీకాల్ చేసింది. అయితే, మారుతి ఇలా లోపంతో ఉన్న కార్లను వెనక్కి పిలవడం చాలా మంది అంశం. చాలా కంపెనీలు లోపం ఉన్న కార్లకు చడీచప్పుడు లేకుండా రిపేరి చేయించి పంపిస్తాయి.

కస్టమర్ల భద్రతే లక్ష్యంతో కొత్తగా విడుదలై, మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో మారుతి ఓ మాత్రం వెనక్కితగ్గకుండా సాంకేతికంగా లోపంతో విక్రయించిన కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేసింది.

More from DriveSpark

Article Published On: Friday, December 8, 2017, 18:36 [IST]
English summary
Read In Telugu: Maruti Dzire Recalled In India — Here’s Why
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+