జిప్సీ ప్రొడక్షన్‌కు బ్రేక్ వేసిన మారుతి సుజుకి

Written By:

ఎలాంటి రహదారైనా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, ఆఫ్ రోడింగ్ లక్షణాలతో తక్కువ నిర్వహణ ఖర్చుతో సులభమైన నిర్వహణ గల వాహనంగా మారుతి సుజుకి జిప్సీ అత్యుత్తమ ఎంపిక. ఇది సాధారణ కొనుగోలుదారుల నిర్ణయం కాదు. సాక్షాత్తు ఇండియన్ ఆర్మీ ఎన్నో ఏళ్ల పాటు జిప్సీని తమ అన్ని రవాణా అవసరాల కోసం వినియోగించబడింది. ఇంతటి పేరుమోసిన జిప్సీకి మారుతి శుభం పలకనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి సుజుకి జిప్సీ

కొన్ని నెలల క్రితం ఇండియన్ ఆర్మీ రెగ్యులర్‌గా వినియోగించే మారుతి జిప్సీ స్థానంలోకి టాటా సఫారీని ఎంచుకుంటున్నట్లు తెలిపింది. సఫారీ వాహనాల కొనుగోలుకు సంభందించి ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

మారుతి సుజుకి జిప్సీ

మారుతి ఇది వరకు సాధారణ మార్కెట్ కోసం కన్నా ఆర్మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిప్సీలను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసేది. ఇప్పుడు ఆర్మీతో కొనుగోలు ఒప్పందం లేకపోయేసరికి జిప్సీ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలనే నిర్ణయం తీసుకుంది.

మారుతి సుజుకి జిప్సీ

ఇండియన్ ఆర్మీ టాటా మోటార్స్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు సుమారుగా 3,200 సఫారీ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.

మారుతి సుజుకి జిప్సీ

మారుతి సుమారుగా మూడు దశాబ్దాల క్రితం జిప్సీ వాహనాన్ని పరిచయం చేసింది. ఇండియన్ మార్కెట్లో అమ్మకాల్లో పెట్రోల్ ఇంజన్‌తో నడిచే 4X4 డ్రైవ్‌ వెహికల్‌గా జిప్సీ మాత్రమే నిరూపించుకుందే. ఈ శ్రేణిలో అత్యుత్తమ అమ్మకాలు సాధించిన ఏకైక వాహనం జిప్సీనే.

మారుతి సుజుకి జిప్సీ

తక్కువ ఖర్చుతో మరియు సులభమైన నిర్వహణ కలిగిన వాహనంగా, అన్ని వాతావరణ పరిస్థితుల్లో, ఎలాంటి భూ భాగాలలోనైనా అత్యుత్తమ ఆఫ్ రోడింగ్ లక్షణాలను ప్రదర్శించే వాహనంగా నిరూపించుకున్నందున ఇండియన్ ఆర్మీ దీనిని ఎన్నో ఏళ్ల పాటు ఎంచుకుంటూ వచ్చింది.

మారుతి సుజుకి జిప్సీ

మారుతి సుజుకి ఇంతటి ప్రభావవంతమైన జిప్సీ వాహనాన్ని ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయలేదు. ఇంటీరియర్ ఫీచర్లు, డిజైన్ మరియు సాంకేతిక అంశాల పరంగా ఎలాంటి మార్పులకు గురిచేయకుండా ఒకే మోడల్‌ను ఎక్కువ కాలం పాటు అందుబాటులో ఉంచుతూ వచ్చింది. అందువలనమార్కెట్ నుండి నిష్క్రమించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి జిప్సీ

ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న మారుతి సుజుకి జిప్సీలో 1.3-లీటర్ సామర్థ్యం గల బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ కలిగి ఉంది.

మారుతి సుజుకి జిప్సీ

ఇది గరిష్టంగా 80బిహెచ్‌పి పవర్ మరియు 103ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి అనుసంధానం చేసిన 4-డ్రైవ్‌సిస్టమ్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

మారుతి సుజుకి జిప్సీ

ఇండియన్ ఆర్మీలోనే కాకుండా ఇండియన్ మార్కెట్లో జిప్సీ స్థానాన్ని ఆక్రమించిన టాటా సఫారి విషయానికి వస్తే, ఇందులో 2.2-లీటర్ సామర్థ్యం గల వారికోర్ డీజల్ ఇంజన్ కలదు.

మారుతి సుజుకి జిప్సీ

ఇందులోని శక్తివంతమైన వారికోర్ ఇంజన్ గరిష్టంగా 156బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు మరియు రెండు చక్రాలకు(ఆప్షనల్) సరఫరా అవుతుంది.

 
English summary
Maruti Looking To Cease Gypsy Production — The End Of An Era?
Story first published: Friday, March 3, 2017, 13:07 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark