ఇగ్నిస్ ఆల్ఫా ఆటోమేటిక్ విడుదల చేసిన మారుతి సుజుకి: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు
మారుతి సుజుకి తమ ఇగ్నిస్ ఆల్ఫా వేరింయట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో విపణిలోకి విడుదల చేసింది.
మారుతి సుజుకి తమ ఇగ్నిస్ ఆల్ఫా వేరింయట్‌ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో విపణిలోకి విడుదల చేసింది. ఇగ్నిస్ పెట్రోల్ ఆల్ఫా ఆటోమేటిక్ ధర రూ. 7,01,143 లు మరియు ఇగ్నిస్ డీజల్ ఆల్ఫా ఆటోమేటిక్ ధర రూ. 8,08,050 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్ టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫా కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లోనే లభించేది. అయితే మారుతి తమ ఆటోగేర్ షిఫ్ట్ (AGS)ను ఇగ్నిస్ టాప్ వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌గా పరిచయం చేసింది.
Recommended Video


సాంకేతికంగా ఇగ్నిస్ ఆల్ఫా పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభించును. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది అదే విధంగా ఫియట్ నుండి సేకరించిన 1.3-లీటర్ డీజల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

డిజైన్ పరంగా ఇగ్నిస్ ఆల్ఫా వేరియంట్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్ సపోర్ట్ చేయగల పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎక్ట్సీరియర్ బాడీ పెయింట్‌ను పోలి ఉండే ఇంటీరియర్ ప్యానల్స్ మరియు మూడు విభిన్న ఎక్ట్సీరియర్ బాడీ కలర్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

భద్రత పరంగా మారుతి సుజుకి ఇగ్నిస్‌లో ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు మరియు ఫోర్స్ లిమిటెర్లతో పాటు ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ మరియు పెడస్ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మారుతి తొలుత ఇగ్నిస్‌ను విడుదల చేసినప్పుడు అధిక ఫీచర్లు గల టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫా ను కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందించింది. అయితే, అధిక ఫీచర్లను కలిగిన ఆల్ఫాను ఆటోమేటిక్ వేరియంట్ ఎంచుకునే కస్టమర్లు చాలా మంది ఉండేవారు. వారికి అనుకూలంగా ఇప్పుడు ఆల్ఫా ను ఏఎమ్‌టి వెర్షన్‌లో లాంచ్ చేసింది.


Click it and Unblock the Notifications








