మారుతి ఇగ్నిస్ ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభం
మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల ఎప్పుడా అని యావత్తు ఇండియన్ మార్కెట్ ఎదురుచూస్తోంది. అయితే విడుదలకు ముందే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఇగ్నిస్ ఆన్లైన్ బుకింగ్స్ ను ప్రారంభించింది.
2017 లో మారుతి యొక్క అతి ముఖ్యమైన విడుదల ఇగ్నిస్. ప్రీమియమ్ అర్బన్ కాంపాక్ట్ వెహికల్‌ను విపణిలోని తమ లైనప్‌లోకి ఈ మాసంలో చేర్చనుంది. అయితే ఇగ్నిస్‌ను అమితంగా ఇష్టపడే వారికోసం దీనికి సంభందించిన బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది.

కొనుగోలుదారులు రూ. 11,000 ల బుకింగ్ మొత్తాన్ని చెల్లించి ఆన్‌లైన్‌లో ఇగ్నిస్ ను బుక్ చేసుకోవచ్చు. ఇందు కోసం మారుతి యొక్క నెక్సా వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

భారతీయ ప్యాసింజర్ కార్ల విభాగంలో ఒక కొత్త సెగ్మెంట్ సృష్టించుకుంటూ విడుదల అవుతున్న ఇగ్నిస్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. మొదటి సారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించినపుడు సందర్శకుల నుండి భారీ స్పందన లభించింది.

మారుతి సుజుకి దీనిని ప్రత్యేకించి మిల్లేనియల్స్ కోసం పరిచయం చేస్తున్నట్లు ఇది వరకే ప్రకటించింది. మిల్లేనియల్స్ అనగా 1980 నుండి 1990 మధ్య జన్మించిన వారు.

శరీరాకృతి పరంగా ఇగ్నిస్ పాత కాలం యొక్క డిజైన్ రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ పట్టణ వాసులకు కావాల్సిన అతి ముఖ్యమైన ఫీచర్లను పరిచయం చేయడం జరిగింది. మరియు క్రాసోవర్ స్టైల్లో ఉండటం ద్వారా 180ఎమ్ఎమ్ అందివ్వడం సాధ్యమైంది.

అన్ని రకాల రహదారులకు సరిపోయే విధంగా పెద్ద వీల్ ఆర్చెస్ కలవు. కారుకు ఇరువైపులా ప్లాస్టిక్ క్లాడింగ్, ముందు మరియు వెనుక వైపున విలక్షణమైన డిజైన్ కలిగి ఉంది. కేవలం ఇండియా మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దీనిని అభివృద్ది చేసింది మారుతి.

టాల్ బాయ్ బాడీ తరహాలో రెట్రో (పాత కాలం) స్టైల్లో గల ఇగ్నిస్ క్రాసోవర్ జనవరి 13, 2017 న ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది. ఇది రూ. 5 నుండి 6.5 లక్షల ప్రైస్ ట్యాగ్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఈ ఇగ్నిస్ క్రాసోవర్‌లో ఫస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్లో ఎల్ఇడి హెడ్ లైట్లు, పగటి పూట వెలిగే లైట్లు, నూతన డిజైన్ లో ఉన్న స్టీరింగ్ వీల్, స్విఫ్ట్, డిజైర్ మరియు ఎర్టిగాలకు భిన్నంగా ప్రత్యేకమైన వేదిక మీద దీనిని అభివృద్ది చేశారు.

మారుతి ఈ ఇగ్నిస్‌ను పెట్రోల్ మరియు డీజల్ ఇంధన ఆప్షన్‌లలో మొత్తం 14 వేరియంట్లలో విడుదల చేయడం జరిగింది. అంతే కాకుండా పియర్ల్ వైట్, సిల్కీ సిల్వర్, గ్లిస్టెనింగ్ గ్రే, అప్‌టౌన్ రెడ్, టిన్సెల్ బ్లూ మరియు అర్బన్ బ్లూ వంటి విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు.

మారుతి తమ నెక్సా అవుట్‌లెట్ల ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంచనుంది. ఇందులో భద్రత కోసం స్టాండర్డ్‌గా డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ISOFIX చైల్డ్ సీట్ మరియు పెడస్ట్రేన్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ రెండు గేర్‌బాక్స్‌లతో ఇగ్నిస్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. బేస్ మరియు టాప్ వేరియంట్ ఇగ్నిస్ లను ఆప్షన్‌ల్ గా రెండు గేర్‌బాక్స్‌లలో ఏదో ఒకదానిని ఎంచుకునే అవకాశాన్ని కల్పిచింది.

సాంకేతికంగా ఇగ్నిస్‌లో 81.8బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ విటివిటి పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 20.89 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

ఇగ్నిస్‌లోని 1.3-లీటర్ డిడిఐఎల్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇది లీటర్‌కు 26.80 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.


Click it and Unblock the Notifications








