విడుదలైన రెండు నెలల్లో ఎన్ని ఇగ్నిస్ కార్లు రోడ్డెక్కాయో తెలుసా ?

Written By:

మారుతి సుజుకి జనవరి మధ్య భాగంలో తమ ఇగ్నిస్ అర్బన్ క్రాసోవర్ కారును విడుదల చేసింది. విడుదలకు ముందే ఆన్‌లైన్ ద్వారా ఇగ్నిస్ బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పటి వరకు నమోదైన అమ్మకాలు 50 శాతానికి పైగా ఇలా ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారానే కావడం గమనార్హం.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి సుజుకి ఇగ్నిస్ విక్రయాలు

మొత్తం 12,000 బుకింగ్స్ నమోదు కాగా వాటిలో 10,000 యూనిట్ల ఇగ్నిస్ కార్లను డెలివరీ ఇచ్చింది. డెలివరీ ఇవ్వాల్సిన పెండింగ్ బుకింగ్స్ ఇంకా చాలానే ఉన్నాయి. బుకింగ్స్‌కు తగ్గ ఉత్పత్తి చేయలేకపోతుండటం వలన వెయింటింగ్ పీరియడ్ రెండు నుండి మూడు నెలలుగా ఉంది.

ఇగ్నిస్ అమ్మకాలు

ప్రస్తుతం హర్యానాలో ఉన్న గుర్గావ్ ప్లాంటులో నెలకు 4,500 నుండి 5,000 యూనిట్ల వరకు ఉత్పత్తి చేస్తోంది. ఇదే ప్లాంటులో మారుతి తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ వితారా బ్రిజాను కూడా ఉత్పత్తి చేస్తోంది.

ఇగ్నిస్ అమ్మకాలు

గత రెండేళ్ల కాలంగా మారుతి విడుదల చేసిన కొత్త ఉత్పత్తులు బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్, వితారా బ్రిజా మోడళ్లను ముందు డిమాండ్‌కు తగ్గట్టుగా డెలివరీ ఇచ్చి, తరువాత వేరియంట్ల వారీగా వెయింట్ పీరియడ్ కొనసాగించడం జరిగింది. ఇదే తరహా శైలిని ఇగ్నిస్ విక్రయాల్లో అవలంభించనున్నారు.

ఇగ్నిస్ అమ్మకాలు

మారుతి తాజాగ విడుదల చేసిన బాలెనో ఆర్ఎస్ స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్‌ను మారుతి నూతన మానేసర్ ప్లాంటులో మరియు సాధారణ బాలెనో హ్యాచ్‌బ్యాక్‌ను గుజరాత్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది.

ఇగ్నిస్ అమ్మకాలు

ఇగ్నిస్ క్రాసోవర్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా కెయువి100 మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వంటి వాటికి గట్టి పోటీనిస్తోంది.

ఇగ్నిస్ అమ్మకాలు

ఇగ్నిస్ క్రాసోవర్‌ను వినియోగదారులు పెట్రోల్ నుండి ఆరు మరియు డీజల్ నుండి ఐదు విభిన్న వేరియంట్లను ఎంచుకోవచ్చు.

ఇగ్నిస్ అమ్మకాలు

ఇగ్నిస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5,04,010 లు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది. మీకు నచ్చిన నగరంలో ఇగ్నిస్ ధరలను తెలుసుకోండి...

ఇగ్నిస్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

English summary
Maruti Suzuki Ignis Sales Exceed 10000 Since India Launch
Story first published: Tuesday, March 7, 2017, 15:19 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark