మారుతి అభివృద్ది చేస్తున్న నెక్ట్స్ కారు ఇదే

Written By:

మారుతి సుజుకి తరువాత కారును పూర్తిగా దేశీయ విపణిలోనే అభివృద్ది చేయనుంది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ కెనిచి అయుకవా ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ తమ తరువాత మోడల్ గురించిన వివరాలు వెల్లడించాడు.

మారుతి సుజుకి తరువాత కారు

మారుతి సుజుకి తమ తర్వాత కారును అభివృద్ది చేసే బాధ్యతను భారతీయ ఇంజనీర్లకు అప్పగిస్తున్నట్లు అయుకవా పేర్కొన్నాడు, దేశీయ ప్యాసింజర్ కార్ల విభాగంలో మారుతి ఇప్పుడు బాగానే రాణిస్తోంది. కాబట్టి ఇండియన్స్‌ కోసం ప్రత్యేకంగా ఇండియన్ ఇంజనీర్ల చేత నిర్మించనున్నట్లు చెప్పుకొచ్చాడు.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మారుతి సుజుకి తరువాత కారు

ప్రస్తుతం విపణిలో ఉన్న కొన్ని మోడళ్లను ఇండియన్ ఇంజనీర్లు అభివృద్ది చేసారు. అందులో ఒకటి వితారా బ్రిజా. నిజానికి వితారా బ్రిజా జపాన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా వచ్చిన మోడల్ అయినప్పటికీ, బాడీ మొత్తాన్ని ఇండియాలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం డిజైన్ చేసింది.

మారుతి సుజుకి తరువాత కారు

మారుతి సుజుకి తమ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌న్ రోహ్తక్‌లో ఏర్పాటు చేయనుంది. 2018 నాటికి తొలిప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. నూతన ఆర్&డి సెంటర్ కొత్త ఉత్పత్తుల అభివృద్దిలో కీలకపాత్ర పోషించనుంది.

మారుతి సుజుకి తరువాత కారు

ఇండియన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం అభివృద్ది చేయనున్న కొత్త ఉత్పత్తుల గురించి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. అయితే నెక్ట్స్ జనరేషన్ ఆల్టో లేదా వ్యాగన్ ఆర్‌లను రీడిజైన్ చేయనున్నట్లు సమాచారం.

మారుతి సుజుకి తరువాత కారు

మారుతి సుజుకి ఇండియా లైనప్‌లోకి విడుదల కానున్న కారు రెనో క్విడ్ పోటీగా రానున్నట్లు తెలిసింది. 2013లో ప్రదర్శించిన ఏ-సెగ్మెంట్ ఆధారిత క్రాస్‌హైకర్ ఆధారిత హ్యాచ్‌బ్యాక్‌ను సిద్దం చేయనుంది.

మారుతి సుజుకి తరువాత కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో అగ్రస్థానానికి ఎదిగిన మారుతి ఇప్పుడు పూర్తి స్థాయిలో దేశీయంగానే తమ తరువాత కారును అభివృద్ది చేస్తోంది. అంటే, ప్రస్తుతం ఎంట్రీ లెవల్ కార్ల మార్కెట్లో ఉన్న ఇతర సంస్థలకు శాస్వతంగా ముగింపు పలికనుంది.

2018 నుండి ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ 2022 నాటికి పూర్తి స్థాయిలో కార్యరూపందాల్చి, అదే ఏడాది దేశీయ విపణిలోకి ప్రవేశించనుంది.

English summary
Read In Telugu: Maruti Suzuki’s Next Car To Be Developed In India
Story first published: Wednesday, August 9, 2017, 17:56 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark