కొత్త డిజైర్ డెలివరీలను తాత్కాలికంగా వాయిదా వేసిన మారుతి

Written By:

రిపోర్ట్స్ తెలిపిన కథనం మేరకు, సరికొత్త 2017 డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారులోని స్టీరింగ్ వీల్ అసెంబ్లీలో లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించిన తరువాతే డెలివరీ చేయాలని అంత వరకు డెలివరీలను తాత్కాలికంగా వాయిదాలని డీలర్లకు సూచించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి న్యూ డిజైర్ కార్లలో సాంకేతిక లోపం

ఒక బ్యాచ్ కార్లలో మాత్రమే ఈ లోపం ఉందా లేదంటే డెలివరీ అయిన అన్ని కార్లలో కూడా ఈ లోపం ఉందా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. స్టీరింగ్ వీల్ సమస్య ఉందని ఇప్పటి వరకు కస్టమర్ల నుండి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.

మారుతి న్యూ డిజైర్ కార్లలో సాంకేతిక లోపం

లోపం ఉన్న స్టీరింగ్ వీల్ స్థానంలో కొత్త వాటిని అమర్చేందుకు కొత్త స్టీరింగ్ వీల్ సెట్లను మారుతి డీలర్లకు సరఫరా చేస్తోంది. సమస్యాత్మకంగా ఉన్న స్టీరింగ్ అసెంబ్లీ తొలగించి, నూతన స్టీరింగ్ వీల్ ఇన్‌స్టాల్ చేయనున్నారు.

మారుతి న్యూ డిజైర్ కార్లలో సాంకేతిక లోపం

మారుతి సుజుకి విడుదల మూడవ తరం 2017 డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ కారులో 1.2-లీటర్ మరియు పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. రెండు ఇంజన్ వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరిగ్గా నెలరోజుల క్రితం మారుతి తమ న్యూ డిజైర్‌ను విపణిలోకి విడుదల చేసింది. ఇప్పటికే పలు సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి అత్యుత్తమ నిర్మాణ విలువలతో కార్లను ఉత్పత్తి చేసి, కస్టమర్లకు డెలివరీ ఇవ్వడం మీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

English summary
Read In Telugu Maruti Suzuki Reportedly Fixing An Issue In The New Dzire
Story first published: Friday, June 16, 2017, 16:11 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark