ఎయిర్ బ్యాగ్ జోడింపుతో స్విఫ్ట్ డిఎల్ఎక్స్ విడుదల: ప్రారంభ ధర రూ. 4.8 లక్షలు
మారుతి సుజుకి లైనప్‌లోని స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ డిఎల్ఎక్స్ వేరియంట్‌ను డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగు జోడింపుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీని రూ. 4.8 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నట్లు తెలిపింది.
భారత దేశపు లీడింగ్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ స్విఫ్ట్ లోని డిఎల్ఎక్స్ వేరియంట్‌ను డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఫీచర్ జోడింపుతో విపణిలోకి విడుదల చేసింది. డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగును స్టాండర్డ్ ఫీచర్‌గా అందించిన స్విఫ్ట్ డిఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ. 4.8 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

ఇందులో నూతనంగా ఎయిర్ బ్యాగ్ జోడింపు మినహా మరే ఫీచర్లు రాలేదు, అయితే మునుపటి స్విఫ్ట్ డిఎల్ఎక్స్ వేరియంట్లో అన్ని డోర్లకు పవర్ విండోలు, నల్లటి మెరుగులు దిద్దిన పిల్లర్లు మరియు సెంట్రల్ లాకింగ్ వంటివి కొనసాగింపుగా వచ్చాయి.

స్విప్ట్ డిఎల్ఎక్స్ ఇంటీరియర్‌లో బ్లూటూత్ మరియు యుఎస్‌బి కనెక్టివిటితో పాటు స్పీకర్ల అనుసంధానం గల మ్యూజిక్ సిస్టమ్ కలదు. ఇక్కడ తెలిపిన ఫీచర్లు స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ వేరియంట్లో లేవనే సంగతి గుర్తించండి.

సాంకేతికంగా ఇందులో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల ఇది గరిష్టంగా 83బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. మైలేజ్ లీటర్‌కు 20.4 కిమీలుగా ఉంది.

డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగు గల స్విఫ్ట్ డిఎల్ఎక్స్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 4.8 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

ఆరు ఎయిర్ బ్యాగులతో లభించే అత్యంత చౌకైన కారు...
ఇండియన్ మార్కెట్లో తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉండే కారు ఏదో తెలుసా..? దాని గురించి పూర్తి వివరాలు...

ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ కు కొనసాగింపుగా మారుతి 2017 థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. పాత మోడల్ కాకుండా అతి త్వరలో అమ్మకాలకు సిద్దం కానున్న దీనిని ఎంచుకోండి. దానికంటే ముందు దీని ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫోటోలను వీక్షించడానికి క్రింది గ్యాలరీని క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications