జెనీవా మోటార్ షో వేదికగా 2017 మారుతి సుజుకి స్విఫ్ట్ ఆవిష్కరణ

Posted By:

జపాన్‌కు చెందిన సుజుకి కార్ల తయారీ సంస్థ 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను యూరప్‌లోని స్విట్జర్లాండులో ఘనంగా జరుగుతున్న 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించింది. గత ఆరు నెలల నుండి ఈ 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియాలో విడుదల చేస్తుందని వచ్చిన అనేక ఆధారం లేని కథనాలను ఈ వేదిక నిజం చేసింది. సుజుకి ఇప్పటికే ఈ మోడల్ స్విఫ్ట్‌ను జపాన్ మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే...

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

87వ జెనీవా మోటార్ షో వేదిక మీద సుజుకి ప్రదర్శించిన 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న బూస్టర్ జెట్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌లు ఉన్నాయి. ఈ బూస్టర్ జెట్ ఇంజన్ ప్రస్తుతం బాలెనో ఆర్ఎస్ లో గుర్తించవచ్చు.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

సరికొత్త స్విఫ్ట్ లో ఉన్న 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 90బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి అనుసంధానం చేసిన 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం ద్వారా పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు అందుతుంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

సుజుకి అందించిన మరో ఇంజన్ ఆప్షన్ 1.0-లీటర్ బూస్టర్ జెట్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 102బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ ముందు చక్రాలకు అందుతుంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

డిజైన్ విషయానికి వస్తే, గత ఏడాది జపాన్‌లో సుజుకి ప్రదర్శించిన స్విఫ్ట్‌ను అచ్చంగా పోలి ఉంది. పెద్ద పరిమాణంలో ఫ్రంట్ గ్రిల్, ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, ముందు వైపున నూతన బంపర్, స్పోర్టివ్ రూఫ్ డిజైన్, ఎల్ఇడి టెయిల్ లైట్లు మరియు వెనుక వైపున రివైజ్ చేయబడిన బంపర్ కలదు.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి ఈ 2017 స్విఫ్ట్‌ను విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. దీనిని సుమారుగా రూ. 5 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ ఏడాది నూతన హ్యాచ్‌బ్యాక్ కారును కొనే ఆలోచనలో ఉన్నారా...? మారుతి విడుదల చేయనున్న 2017 స్విఫ్ట్ కోసం వేచి ఉండండి. ఆ లోపు క్రింది గ్యాలరీలో ఉన్న సరికొత్త స్విఫ్ట్ ఫోటోల మీద ఓ లుక్కేసుకోండి...

 
English summary
2017 Geneva Motor Show: Maruti Swift Showcased In Switzerland — Is India Ready For It?
Story first published: Wednesday, March 8, 2017, 10:11 [IST]
Please Wait while comments are loading...

Latest Photos