జిఎస్‌టి కి అనుగుణంగా మారుతి స్విఫ్ట్ మీద తగ్గిన ధర: త్వరపడండి!
దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి కూడా తమ అన్ని మోడళ్ల మీద ధరలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మీద ధర తగ్గుముఖం పట్టింది.
భారత ప్రభుత్వం నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టిని అమల్లోకి తెచ్చింది. జూలై 1, 2017 నుండి అమలైన ట్యాక్స్ ప్రకారం కార్లు మరియు బైకుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను సవరిస్తున్నాయి.

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి కూడా తమ అన్ని మోడళ్ల మీద ధరలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మీద ధర తగ్గుముఖం పట్టింది.

జిఎస్‌టి లోని ట్యాక్స్‌కు అనుగుణంగా స్విఫ్ట్ మీద కొత్త ట్యాక్స్ అమలు చేసి దేశవ్యాప్తంగా ధర తగ్గించింది. హైదరాబాద్‌లో స్విప్ట్ మీద రూ. 6,700 నుండి రూ. 10,700 ల వరకు తగ్గింది.

స్విఫ్ట్ ధరలు వివిధ వేరియంట్ల వారీగా మరియు వివిధ నగరాల వారీగా వ్యతాసం ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ 14.5శాతంగా ఉండేది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యాట్ స్థానంలో కొత్త ట్యాక్స్ రావడంతో ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కార్ల మీద ట్యాక్స్ తగ్గించడానికి సన్నద్దం అవుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
కార్ల తయారీ సంస్థలకు తమ ఉత్పత్తుల మీద జిఎస్‌టికి అనుగుణంగా ట్యాక్స్ నిర్ణయించడానికి సమయం తీసుకుంటోంది. అయితే పాపులర్ మోడళ్ల మీద జిఎస్‌టి ప్రతి ఫలాలను అందించేందుకు సిద్దమవుతున్నాయి వాహన తయారీ సంస్థలు. అందులో భాగంగానే ఎక్కువగా అమ్ముడుపోతున్న కార్ల మీద ట్యాక్స్ తగ్గిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








