వ్యాగన్ ఆర్ విఎక్స్ఐ ప్లస్ ను మార్కెట్లోకి విడుదల చేసిన మారుతి

Written By:

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి తమ వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ లో విఎక్స్ఐ ప్లస్ అనే వేరియంట్‌ను విడుదల చేసింది. వీటి ధరలు రూ. 4.69 లక్షల నుండి 5.36 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ విఎక్స్ఐ ప్లస్ ధరలు

  • విఎక్స్ఐ ప్లస్ ధర రూ. 4.69 లక్షలు
  • విఎక్స్ఐ ప్లస్ ఒ ధర రూ. 4.89 లక్షలు
  • విఎక్స్ఐ ప్లస్ ఆటోమేటిక్ ధర రూ. 5.17 లక్షలు
  • విక్స్ఐ ప్లస్ ఆటోమేటిక్ ధర రూ. 5.36 లక్షలు
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

వ్యాగన్ ఆర్ విఎక్స్ఐ ప్లస్ సాంకేతిక వివరాలు

మారుతి సుజుకి తమ వ్యాగన్ ఆర్ విఎక్స్ఐ ప్లస్ వేరియంట్లో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే కె10బి మూడు సిలిండర్లు గల పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషను అనుసంధానంతో లభించును.

  • సామర్థ్యం - 999సీసీ
  • పవర్ - 6,200ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 67బిహెచ్‌పి
  • టార్క్ - 3,500 ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 90ఎన్ఎమ్
  • మైలేజ్ - లీటర్ కు 20.5కిమీలు
  • ఇంధన ట్యాంకు సామర్థ్యం - 35 లీటర్లు
  • బూట్ స్పేస్ - 180 - లీటర్లు

వ్యాగన్ ఆర్ విఎక్స్ఐ ప్లస్ వేరియంట్లలోని ఫీచర్లు: మారుతి సుజుకి ఆ వ్యాగన్ ఆర్ టాల్ బాయ్ బాడీ లో అల్లాయ్ వీల్స్, సరికొత్త ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, మరియు సైడ్ స్కర్ట్స్ లను అందించింది.

మారుతి భద్రత పరంగా ఇందులో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మరియు డ్యూయల్ ఎయిర్ బ్యాగులను ఆప్షనల్‌గా అంజదించింది.

కారు కొనమని సలహా ఇస్తే... కార్ల కంపెనీనే కొనేశాడు...!!
ట్విట్టర్‌లో ఓ వ్యక్తి ఆనంద్ మహీంద్రా కు కారు కొనమని సలహా ఇచ్చాడు.... అయితే దిగ్గజ వ్యాపారవేత్త ఏకంగా ఆ కార్లు తయారు చేసే కంపెనీనే కొనేశాడు.

మారుతి సుజుకి ఈ మద్యనే తమ ఇగ్నిస్ క్రాసోవర్ కారును విడుదల చేసింది. ఇగ్నిస్ ఎంచుకోవాలనుకుంటున్నారా....? అయితే క్రింద గల ఇగ్నిస్ ఫోటో గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి...

 

English summary
Maruti WagonR VXi+ Launched In India; Prices Start At Rs 4.69 Lakh
Please Wait while comments are loading...

Latest Photos